Begin typing your search above and press return to search.
భయపెడుతున్న నంబర్లు....వైసీపీ టీడీపీకి అగ్ని పరీక్ష
By: Tupaki Desk | 18 Dec 2022 12:30 AM GMTఏపీలో మరోమారు అధికారంలోకి రావడానికి వైసీపీ చూస్తోంది. జగన్ కి ఒక్క చాన్స్ ఇచ్చేసారు కాబట్టి ఇక మళ్ళీ ఇవ్వవద్దు అంటున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తేనే ఏపీ పురోగతి, అభివృద్ధి అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉండగా, వచ్చే ఎన్నికల్లో డ్యాం ష్యూర్ గా తాను గెలుస్తాను అన్న నమ్మకం అయితే అధికార వైసీపీలో నిన్నటిదాకా ఉండేది. అలాగే విపక్షంలో ఉన్న తెలుగుదేశంలో కూడా తాము కాక ఎవరికి జనాలు ఎన్నుకుంటారు అన్న ఆలోచన ఉండేది.
కానీ ఇపుడు గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ రెండు పార్టీలకు తెలిసి వస్తున్నాయట. అనుకున్నంతగా అనుకూల పరిస్థితులు అయితే లేవన్న చేదు నిజాలు అయితే రెండు పార్టీల అధినేతలకు పూర్తిగా అర్ధమైంది అని అంటున్నారు. వై నాట్ 175 అని ఎంతలా బిగ్ సౌడ్ చేస్తున్నా జగన్ అనుకున్నట్లుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు లేవు అని అంటున్నారు.
ఎప్పటికపుడు సర్వే నివేదికలు తెప్పించుకుని అదే విధంగా ఎమ్మెల్యేలను అలెర్ట్ చేస్తున్నా కూడా జగన్ కి 38 సీట్లలో వారి పనితీరు బాలేదని తెలుస్తోంది. ఆరేడు నెలల నుంచి గడపగడపకు ఎమ్మెల్యేలను తిప్పుతున్నారు. దాని మీద మూడేసి నెలలకు ఒకసారి వర్క్ షాప్స్ ని కండక్ట్ చేస్తున్నారు. పరిస్థితి మార్చుకోవాలని చెబుతున్నారు. అయినా కూడా ఎక్కడా మెరుగుపడకపోగా ప్రతీ వర్క్ షాప్ నాటికీ ఆ వ్యతిరేకత ఇంకా పెరుగుతోంది. గతసారి వర్క్ షాప్ లో 27 అనుకుంటే అది ఇపుడు 38 సీట్లకు పాకింది. అంటే మూడు నెలల వ్యవధిలో మరో పదకొండు సీట్లు వైసీపీకి యాంటీగా వచ్చి చేరాయి.
ఎన్నికలకు ఇంకా గట్టిగా చూస్తే 16 నెలల సమయం మాత్రమే ఉంది. ఇంతలో ఏ మేరకు సర్దుకుంటారో తెలియదు. అసలే అధికార పార్టీ కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. దాంతో జగన్ ఎప్పటికపుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజా వర్క్ షాప్ లో కూడా ఆయన 38 మంది ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని కోరారు. ఒక వేళ వారు మారకపోతే తానే కొత్తవారిని వెతుక్కుంటాను అని చెబుతున్నారు. మరి వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన ఆ 38 సీట్లలో టీడీపీకి పాజిటివ్ గా ఉంటే జాతకం మారుతుంది అన్న చర్చ ఉంది.
ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ రాష్ట్రాన్ని అనేకసార్లు ఏలిన పార్టీ. అయినా సరే 175 సీట్లలో ఈ రోజుకీ 35 సీట్లలో అభ్యర్ధులు లేరు. ఒక విధంగా ఇక్కడ ఇంచార్జిలను కూడా నియమించుకోలేపోతోంది ఆ పార్టీ. అలా కనుక వదిలేసి ఊరుకుంటే మాత్రం కచ్చితంగా ఈ 35 సీట్లే కొంప ముంచుతాయన్న భయం టీడీపీకి ఉంది. ఇలా చూసుకుంటే రెండు పార్టీలకు ఇబ్బందులు పొంచి ఉన్నాయని అంటున్నారు.
ఇక 2019 ఎన్నికల్లో చూస్తే వైసీపీకి 151 సీట్లతో జనం పట్టం కడితే మరో నలురుగు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి ఆ పార్టీలోకి వచ్చి చేరారు. ఇక టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రస్తుతానికి మిగిలింది 19 మందే. ఇదే టీడీపీకి 2014 ఎన్నికల్లో 102 సీట్లు లభించాయి. ఆనాడు వైసీపీకి 67 సీట్లు మాత్రమే దక్కాయి. అంటే రెండు పార్టీల మధ్య తేడా 35 అన్న మాట. ఇపుడు కూడా అవే నంబర్లు రెండు పార్టీలను భయపెడుతున్నాయి అని అంటున్నారు.
ఈ నంబర్లు కనుక అటు ఇటు అయితే 2014 సీన్ రిపీట్ అయి వైసీపీ మరోమారు ప్రతిపక్షంలోకి రావాల్సి ఉంటుంది. అలా కాకుండా వైసీపీ నిలబెట్టుకుంటే సింపుల్ మెజారిటీతో పవర్ లోకి వస్తుంది. అయితే ఈ కీలకమైన నంబర్ ఎటు టర్న్ అవుతుందో తెలియదు. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర టైం ఉంది. ఈ లోగా పొత్తులు ఎత్తులు చాలా ఉంటాయి. అలాగే సామాజిక సమీకరణలు మారుతాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు. దాని టీడీపీ క్యాష్ చేసుకుంటే లెక్క మారుతుంది. లేకపోతే సీన్ మరోలా ఉంటుంది. మొత్తానికి మాత్రం భయంకరమైన నంబర్లుగా ఆ రెండూ వైసీపీని, టీడీపీని కూడా హడలెత్తిస్తున్నాయి అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.