Begin typing your search above and press return to search.

ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు...స్వరూపానందేంద్ర ఆగ్రహం ఎవరి మీద....?

By:  Tupaki Desk   |   27 Dec 2022 12:30 AM GMT
ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు...స్వరూపానందేంద్ర ఆగ్రహం ఎవరి మీద....?
X
ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతున్నాయని విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అంటూ పేరు చెప్పలేదు కానీ ఆ మతం వల్ల మత మార్పిడులు పెరిగాయని ఆయన విమర్శించారు. ఆ మత్రం ప్రధానంగా గిరిజనులను టార్గెట్ గా చేసుకుని ఏజెన్సీలో మత మార్పిడులకు తెర తీస్తోందని ఆయన మండిపడ్డారు.

ఏపీలో మత మార్పిడులను అడ్డుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ విషయంలో శారదాపీఠం ముందుండి పోరాడుతుంది అని ఆయన అన్నారు. ఏపీలో మత మార్పిడులు పెద్ద ఎత్తున సాగడం విచారకరం అని ఆయన అన్నారు. ఒక మతం లో పుట్టిన వారు జీవితాంతం అందులోనే ఉండాలని మతం మారాలని అనుకోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎవరైనా తమ మతంలో తాము ఉండాల్సిందేనని, పుట్టిన మతం మారడం తప్పు అని ఆయన ఉద్బోదిస్తున్నారు. ఇక మన మతంలోనే మనం అన్న నినాదంతో కార్యక్రమాలను చేపట్టడానికి కీలక నిర్ణయం శారదాపీఠం తీసుకుందని ఆయన చెప్పారు. ప్రత్యేకించి ఏజెన్సీ ఏరియాలలో మత మార్పిడుల మీద దృష్టి పెట్టి అక్కడ వాటిని అడ్డుకుని తీరుతామని ఆయన చెప్పారు.

అమాయకులైన గిరిజనులను ఒక దుర్మార్గ మతం టార్గెట్ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మతం ఏమిటి అన్నది ఆయన చెప్పకపోయినా ఎవరి ఊహకు వారికే వదిలేశారు. ఇక్కడ చూస్తే స్వరూపానందేంద్ర సరస్వరి మహాస్వామి జగన్ కి అత్యంత సన్నిహితులైన స్వామీజీగా ఉన్నారు. జనవారి 27నుంచి 31 వరకూ జరిగే విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు కూడా జగన్ని హాజరు కావాలని ఆహ్వానించారు.

ఇక జగన్ విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా స్వాంజీ అంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఆయన్ని తన ఆధ్యాత్మిక గురువుగా కూడా చూస్తారు. అలాంటి జగన్ ఏలుబడిలో మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని స్వామెజీ ఆరోపణ చేయడం విశేషం. మరి ఇప్పటిదాకా చూస్తే ఇదే తరహా ఆరోపణలను బీజేపీ చేస్తూ వచ్చింది. అయితే జగన్ సన్నిహిత స్వామీజీయే ఇపుడు తన విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టడం అంటే ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.