Begin typing your search above and press return to search.
రావాలి జగన్ : సీఎం వస్తే ఆ రోజు సెలవే మరి!
By: Tupaki Desk | 16 July 2022 11:30 PM GMTరావాలి జగన్ అని ఇపుడు స్కూల్ విద్యార్ధులు పాట పాడుతున్నారు. జగన్ ఏ జిల్లాకు వస్తే ఆ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించేస్తున్నారు. ఇది చాలా కాలంగా జరిగిపోతోంది. నిజానికి ఒక వైపు కరోనా ప్రభావంతో పాఠశాలలు ఆలస్యంగా మొదలయ్యాయి. ఇపుడిపుడే అంతా గాడిన పడుతున్న వేళ ఇలా సీఎం వస్తే సెలవు ఇస్తూ పోతే ఇక చదువులు ఏం సాగుతాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలా వానాకాలం చదువులతో తమ పిల్లలు ఏమి బాగుపడతారు అని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ జగన్ రాకకు స్కూళ్ళకు సెలవులకు మధ్య సంబంధం ఏంటి అంటే చాలానే ఉంది. తాజాగా జగన్ విశాఖ వచ్చి హాహనమిత్ర కార్యక్రమం నాలుగవ విడత కింద లబ్దిదారుల ఖాతాలో బటన్ నొక్కి నగదు జమ చేశారు. సీఎం వచ్చి వెళ్ళింది అంతా జస్ట్ రెండు మూడు గంటలు మాత్రమే. దాని కోసం బంగారం లాంటి స్కూళ్ళకు రోజంతా తాళాలు వేశారని జనాలు విమర్శిస్తున్నారు.
జగన్ సభకు జనాలను తరలించేందుకు విద్యా సంస్థలకు చెందిన బస్సులను తీసుకోవడం వల్లనే ఈ రకంగా జరిగింది అంటున్నారు. ఒక వైపు ఆటోల ద్వారా కూడా విద్యార్ధులు పెద్ద ఎత్తున స్కూళ్ళకు వెళ్తారు, జగన్ వచ్చేసరికి ఆటోవాలాలు కూడా కనిపించాలని వారిని కూడా అధికారులు ఆపేయడంతో మొత్తానికి పాఠాశాలకే సెలవు ఇవ్వాల్సి వచ్చింది అంటున్నారు.
ఇక చూస్తే విద్యాసంస్థల మూసివేతకు సంబంధించి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఈ నెల 13న జిల్లా విద్యాశాఖాధికారికి లేఖ రాశారు. దాని ప్రకారమే అధికారులు 34 బస్సులను వినియోగించుకునేలా ఆ రోజు పాఠశాలలకు సెలవు ప్రకటించాలని డీఈవోను కోరారని చెబుతున్నారు. అలా విశాఖలో ఉన్న చాలా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించేశారు.
ఇలా జగన్ మెప్పు కోసం వాహనమిత్ర సభకు వచ్చే జనాల కోసం స్కూళ్ళ బస్సులను ఉపయోగించడమేంటి అన్న ప్రశ్న కూడా ఉంది. సీఎం సభలకు ప్రైవేట్ వాహనాలలో జనాలను తరలించడం అన్నది ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది అంటున్నారు. గతంలో కూడా తిరుపతిలో ఒక భక్తుడికి చెందిన ఇన్నోవా కారుని పోలీసులు తీసుకున్న సంగతి అది పెద్ద రచ్చ అయిన సంగతి తెలిసిందే.
ఇక జగన్ విశాఖ వచ్చారని చాలా చోట్ల సచివాలయాకలు కూడా తాళాలు వేశారు. అదే విధంగా అక్కడ కూడా కార్యకలాపాలను స్థంభింపచేశారు. ఇది మంచి విధానం కాదని అంటున్నారు. ఇది అధికార పార్టీ నేతలకు తెలిసే జరుగుతోందా లేక అధికారులు తాము అతి ఉత్సాహంతో చేస్తున్నారో తెలియదు కానీ చివరికి ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది అని అంటున్నారు. సీఎం వస్తే సెలవు ఇస్తారు అనుకుంటే ఆకతాయి పిల్లలు రావాలి జగన్ మాకు కావాలి సెలవు అని ఇదే పాట ప్రతీ చోట పాడుకుంటారని సెటైర్లు పడుతున్నాయి.