Begin typing your search above and press return to search.
బెల్గావిలో అమ్మాయిల పరిస్థితి ఇది!
By: Tupaki Desk | 10 Oct 2016 6:24 AM GMTదేశవ్యాప్తంగా నిత్యం ఎక్కాడొ ఒక మూల మహిళలపైనా - అమ్మాయిలపైనా ఏదో ఒక దారుణం చోటుచేసుకుంటూనే ఉంది. మృగాడి ప్రవర్తనకు నిత్యం మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అది దేశరాజధాని అయినా, మారుమూల పల్లె అయినా సరే మగాడి ప్రవర్తనలో మార్పు ఉండటం లేదు, మహిళకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ సమయంలో మొన్నటివరకూ పెప్పర్ స్ప్రేలు పట్టుకుని సిటీ అమ్మాయిలు తిరగాలి అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా కర్రలు పుచ్చుకుని తిరుగుతున్నారు విద్యార్థినులు.
కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావి గ్రామంలో రోజు రోజుకీ అమ్మాయిలపై వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో లైంగిక వేధింపులు తట్టుకోలేక కొందరు ఏకంగా ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఈపరిస్థితులతో అక్కడి గ్రామ వాసులు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడుతున్నారట. ఆ స్థాయిలో ఉంది అక్కడ పరిస్థితి. దీంతో తమను తాము రక్షించుకునేందుకు అక్కడి మహిళలు - బాలికలు ఒంటిరిగా రాకుండా గుంపులు గుంపులుగా బయటకు వస్తున్నారు. ఆ ప్రాంతంలోని విద్యార్థినులు 40 - 45 మంది ప్రతిరోజూ స్కూల్ కు వెళ్తుండటంతో ఆ మార్గంలో ఆకతాయిలు బైక్ లపై వచ్చి వేధించడం సర్వసాధారణమై పోయిందట. దీంతో ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు తమవెంట కర్రలను తీసుకువెళ్తున్నారు విద్యార్థినులు.
ఈ మేరకు విద్యార్థినులకు కార్రలు చేతపట్టి పాఠశాలకు వెళ్లాసిందిగా సూచించినట్టు ప్యాస్ పౌండేషన్ డైరెక్టర్ కిరణ్ నిప్పాణికార్ స్థానిక మీడియాకు వెల్లడించారు. మరో వైపు బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని కూడా వేధింపులకు పాల్పడుతున్నట్టు అక్కడి స్థానికులు వాపోతున్నారు. ఈ సమయంలో మహిళలు ఒంటరిగా వెళ్లడం లేదు సరికదా... బయటకు వెళ్లేటప్పుడు, స్కూళ్లకు వెళ్లేటప్పుడూ కర్రలు చేతపట్టి వెళ్తున్నారు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/