Begin typing your search above and press return to search.
ఆ విద్యార్థినిల బాధ వర్ణనాతీతం..స్పందించిన ప్రజాప్రతినిధులు
By: Tupaki Desk | 28 Oct 2019 8:00 AM GMTప్రభుత్వ పాఠశాలలు అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నా... అవి మాటల వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎంతో మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యలతోనే కొంతమంది సర్కార్ స్కూల్స్ కి తమ పిల్లలని పంపించాలంటేనే భయపడుతున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే .. మహబూబాబాద్ జిల్లా గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 130మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే వీరందరికీ ఒకే ఒక టాయ్ లెట్ ఉంది. అలాగే ప్రాథమిక పాఠశాలలో 80మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఉపాధ్యాయులకు కలుపుకుని ఇక్కడ కూడా ఒకే టాయ్ లెట్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనూ క్యూలో నిలబడాల్సిందే. ఏళ్ల తరబడి ఈ దుస్థితి ఉన్నా ఎంతమంది అధికారులకి విద్యార్థులు తమ గొడ్డుని చెప్పుకున్న .. అధికారులు - ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదు. అధికారులు మారుతున్నారే తప్ప వారి సమస్య మాత్రం తీరడంలేదు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసారు.
ఈ సమస్య పై ఈ మద్యే ఒక పత్రిక లో కథనం వచ్చింది. దీనిపై స్పందించిన రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ తన ఎంపీ నిధుల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులను విడుదల చేస్తానని తెలిపాడు. టాయిలెట్ కోసం చాంతాడంత క్యూలైన్ పాటించాల్సిన దుస్థితి పట్ల అయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టాయిలెట్ల నిర్మాణానికి తాను బాధ్యత తీసుకుని పూర్తి చేయిస్తానని చెప్పారు. అలాగే ఏపీ - మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ .. ఆ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం కోసం తనవంతుగా రూ.1.75లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి కూడా స్పందించారు. సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆ జిల్లా కలెక్టర్ తో ఫోనులో మాట్లాడి ఆ సమస్యని వీలైనంత త్వరగా తీర్చే విధంగా చూడాలని , ఈమేరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనితో ఆ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బృందం సందర్శించి కలెక్టర్ కు నివేదిక సమర్పించింది.