Begin typing your search above and press return to search.
అక్కడ హిజాబ్.. ఇక్కడ అయ్యప్పమాల.. ఏపీలో కొత్త వివాదం!
By: Tupaki Desk | 28 Oct 2022 1:30 AM GMTకర్ణాటక రాష్ట్రాన్ని .. హిజాబ్ వివాదం చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా.. ఎలాంటి నిర్ణయమూ రాలేదు. దీంతో హిజాబ్ విషయం కర్ణాటకను కుదిపేస్తోంది. అయితే.. అక్కడ ఆ వివాదం జరుగుతున్న క్రమంలోనే ఏపీలో సరికొత్త వివాదం తెరమీదికి వచ్చింది. అదే.. అయ్యప్ప మాల. హరిహర శుతుడు అయిన.. అయ్యప్ప భక్తులు.. కార్తీక మాసం.. ప్రారంభంలోనే మాలను ధరించేందుకు మొగ్గు చూపుతారు. ఇలా.. మాలను ధరించిన వారు.. ఎవరి వృత్తిలో వారు ఉంటారు. అయితే.. తాజాగా.. ఏపీలో జరిగిన ఘటన వివాదానికి దారితీసింది.
అయ్యప్ప మాల ధరించి బడికి వచ్చిన విద్యార్థిని ఆ పాఠశాల ఫాదర్ అడ్డుకున్నాడు. దీంతో ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. విద్యార్థి కుటుంబసభ్యులకు విషయం తెలియజేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, మరికొందరు మాలధారులతో కలిసి పాఠశాల దగ్గరకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ పరిణామాలు.. సదరు పాఠశాల వద్ద వివాదానికి దారితీసే పరిస్థితి ఉందని తెలుసుకున్న పోలీసులు సైతం రంగంలోకి దిగారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగామారింది. ఇక్కడి `డీపాల్` ప్రైవేటు పాఠశాల ఆంజనేయ రెడ్డి అనే విద్యార్థి 7వ తరగతి చదువుతున్నాడు. కార్తీక మాసం ప్రారంభం అవడంతో.. విద్యార్థి.. తన తండ్రితో కలిసి.. అయ్యప్పమాల ధరించాడు. మరుసటి రోజు.. అంటే.. బుధవారం పాఠశాలకు వచ్చాడు. గేటు వద్దే ఉన్న ఫాదర్.. విద్యార్థిని అడ్డుకున్నాడు. అంతేకాదు.. అయ్యప్ప మాల తీసివేసి, బూట్లు ధరించి వస్తేనే పాఠశాలలోకి అనుమతిస్తామని, లేదంటే వెళ్లిపోవాలని ఫాదర్ ఆనంద్ స్పష్టం చేశారు.
దీంతో ఖంగు తిన్న విద్యార్థి.. చాలా సేపు బ్రతిమాలాడు. కానీ, ఫాదర్ ఒప్పుకోలేదు. దీంతో విద్యార్థి నేరుగా ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు
ఈ విషయాన్ని చెప్పాడు. పాఠశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ అతని తల్లిదండ్రులు, అయ్యప్పస్వామి మాలధారులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు బడి వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. మాల వేసుకుని బడికి రాకూడదని నిబంధనలు ఉన్నాయని ఫాదర్ చెప్పారు.
ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని వీహెచ్‌పీ సభ్యులు కోరారు. దీంతో వివాదం తారస్తాయికి చేరింది. ఇక, పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కొద్ది సేపు పాఠశాళ ఫాదర్‌కు వ్యతిరేకంగా నినాదాలు కూడా.. మిన్నంటాయి. కాసేపటి తర్వాత ఏమనుకున్నారో.. ఏమో.. ఫాదర్ ఆనంద్.. విద్యార్థి మాల వేసుకుని పాఠశాలకు వచ్చేందుకు అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది.
ఏదేమైనా.. ఈ ఘటన విషయంలో ప్రభుత్వం అలెర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని.. విద్యార్థలు తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలకు ఏదైనా మార్గదర్శకాలు ముందుగానే ఇవ్వాలని.. లేకపోతే.. హిజాబ్ తరహాలో వివాదాలు తెరమీదికి వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.