Begin typing your search above and press return to search.

కరోనా భయంతో స్కూల్ మూసివేత

By:  Tupaki Desk   |   3 March 2020 12:57 PM GMT
కరోనా భయంతో స్కూల్ మూసివేత
X
కరోనా భయం ఎప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతోంది. తాజాగా నోయిడాలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ కి చెందిన ఒక విద్యార్థి తండ్రికి కరోనా వైరస్‌ సోకడంతో , ఆ స్కూల్ యాజమాన్యం మూడు రోజులపాటు సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించింది. గత శుక్రవారం ఆగ్రాలో ఆ వ్యక్తి ఇచ్చిన బర్త్‌ డే పార్టీలో స్కూల్‌ విద్యార్ధులకు సంబంధించిన పలు కుటుంబాలు పాల్గనడంతో . ఆ పార్టీలో పాల్గొన్న కుటుంబాలలో కరోనా పై అలజడి మొదలైంది.

ఆ విద్యార్థి తండ్రికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో హైస్కూల్‌ విద్యార్ధులకు పరీక్షలను రద్దు చేసిన పాఠశాల యాజమాన్యం స్కూల్‌ పరిసరాలను పరిశుభ్రం చేయడంతోపాటు పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేసింది. అలాగే అయన ఇచ్చిన బర్త్‌ డే పార్టీలో పాల్గన్నవారిలో ఆరుగురికి జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ కోసం వారి రక్త నమూనాలను పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించడం జరిగింది. అలాగే ఆ ఆరుగురితో సన్నిహితంగా మెలిగినవారి ఆరోగ్య పరిస్థితిని కూడా వైద్యారోగ్య అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే చైనా తో పాటుగా ప్రపంచ దేశాల ప్రజలని వణికిస్తున్న కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య లక్షకి చేరువలో ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే , ఇప్పటికే మూడు వేలమంది కి పైగా ఈ కరోనా భారినపడి మృత్యువాత పడ్డారు.