Begin typing your search above and press return to search.
అమ్మాయిల ఫొటోస్ తో ఆలా చేసారా !
By: Tupaki Desk | 7 May 2020 3:45 PM GMTనిండా పదిహేను సంవత్సరాలు కూడా లేని ఢిల్లీ స్కూల్ కు చెందిన విద్యార్థులు వారు.. ఆ 15 ఏళ్లకే మైనర్ బాలికల అశ్లీల ఫొటోలు, వాటిపై వ్యాఖ్యానాలు, శృంగార వాంఛలతో అశ్లీలంగా చేసేశారు. స్కూలు పిల్లలు అంతా పెట్టుకున్న ‘బాయ్స్ లాకర్ రూమ్’ ఇన్ స్టాగ్రామ్ గ్రూపు పోస్టులు లీక్ కావడంతో వైరల్ అయ్యాయి. స్కూలు పిల్లలు ఇంత దుర్మార్గంగా చేయడంపై ప్రభుత్వం స్పందించింది. పోలీసులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఓ 15 ఏళ్ల మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకోవడం విశేషం.
నిండా 15 ఏళ్లు కూడా లేని స్కూలు పిల్లలు తమతోపాటు చదువుకుంటున్న మైనర్ బాలికల ఫొటోలు వారి అనుమతి లేకుండా ‘బాయ్స్ లాకర్ రూమ్’ అనే ఇన్ స్టా గ్రూపులో పెట్టి అశ్లీల ఆనందం పొందారు. వారి అనుమతి లేకుండా తోటి విద్యార్థునుల ఫొటోలు షేర్ చేసి వారిపై అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక దాడులు, రేప్, బాడీ షేమింగ్ సంభాషణలు చేసి లైంగిక ఆనందం పొందారు.
అయితే ఈ గ్రూపులో ఉండే ఒక విద్యార్థి ఇందులో జరిగే బాగోతాన్ని స్క్రీన్ షాట్లు, ట్విట్టర్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశాడు. దీంతో ఈ స్కూలు విద్యార్థుల వికృత చేష్టలు వెలుగుచూశాయి.
ఈ సమాచారం వైరల్ కావడం.. పోలీసులకు అందడంతో పోలీసులు ఒక స్కూలు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 15 ఏళ్లకే విద్యార్థులు చేసిన ఆకృత్యాలు వెలుగుచూశాయి.
ఈ గ్రూప్ వెలుగుచూశాక ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఢిల్లీ పోలీసులకు కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టాలని ఆదేశించింది. స్కూలు యాజమాన్యం కూడా పోలీసులకు విద్యార్థులపై ఫిర్యాదు చేసింది.
కాగా దీనిపై ఇన్ స్టాగ్రామ్ సంస్థను పోలీసులు సంప్రదించారు. డిలీట్ చేసిన ఆ గ్రూపు ఐడీ, ఐపీ అడ్రసులు, యాక్సెస్ చేసిన విద్యార్థుల పేర్లు ఇవ్వాలని కోరారు. కానీ ఇన్ స్టాగ్రామ్ ఇంతవరకూ స్పందించలేదు.
40 రోజుల లాక్ డౌన్ లో ఖాళీగా ఉంటున్న పిల్లలు ఇలాంటి అశ్లీల సె* విషయాలకు అట్రాక్ట్ అయ్యి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్టు పోలీసులు తేల్చారు.