Begin typing your search above and press return to search.
ప్రధాని కార్యాలయాన్ని కదిలించిన లేఖ ఇది!
By: Tupaki Desk | 22 Dec 2016 11:58 AM GMTఎక్కడైనా సమస్యలుంటే వాటిని చూసి తెగబాదపడిపోవడం, లేదా సంబందిత అధికారులనో నాయకులనో తిడుతూ కూర్చొవడం.. అనంతరం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోవడం అనేది సర్వసాదారణంగా జరుగుతూ ఉంటుంది. నాయకులు అనబడేవారు కూడా ఎన్నికల సమయంలో జనాలదగ్గరకు ఓట్లు అడగడానికి రావడం, వాగ్ధానాలు చేయడం అనంతరం వారు మరిచిపోవడం, వీరు తిట్టుకోవడం కూడా సర్వసాదారణమే. అయితే ఇలా అందరిలాగా ఆలోచించలేదు నమన అనే బాలిక. చేయాలనుకున్నది చేసింది.. రెండు నెలలైనా ఫలితం రాకపోయే సరికి కాస్త నిరాస చెందింది.. ఇంతలోనే ఆమె ఆశించిన అద్భుతం జరిగిపోయింది.
విషయానికొస్తే... కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లాలో గల ముదిగర్ తాలుకాలోని అలేఖాన్ హోరట్టి అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం ఆ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం 35 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో 300 మంది నివసిస్తున్నారు. అయినాకూడా ఆ ఊరికి కనీస సౌకర్యాలేమీ లేవు, మోటార్ వాహనాలెల్లే రోడ్డు కూడా లేదు. అయితేనేం... ఆ గ్రామంలో నమన అనే 16ఏళ్ల బాలిక ఉంది. బిద్దర్ హళ్లిలోని మోరార్జీ దేశాయ్ రెసిడెంట్ పాఠశాలలో చదువుతున్న నయన.. తన గ్రామాన్ని తలచుకుని ప్రతీరోజూ అందరిలాగానే బాదపడుతూ ఉండేది. ఆబాదలోంచి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే... తమ గ్రామం గురించి దేశప్రధానికి లేఖ రాయాలని. ఇదే విషయాన్ని తమ గ్రామస్తులకు, ఉప్యాధ్యాయులకు చెప్పింది. అనంతరం అనుకున్నట్టుగానే అక్టోబరు 6న ప్రధాని మోడీకి లేఖ రాసింది.
దీంతో రాబోయే ఫలితాన్ని ఆమె కానీ, ఆ ఊరి ప్రజలు కానీ ఎలా ఊహించారో తెలియదు కానీ... లేఖ రాసి రెండు నెలలు అయినా ఎలాంటి స్పందనా రాలేదు. ఇంతలోనే ఆ బాలిక రాసిన లేఖకు ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ఆ గ్రామానికి ఉన్న సమస్యలు తీర్చాలని, కనీస సౌకర్యాలు కలిపించాలని స్థానిక పరిపాలనాధికారులను ఆదేశించింది. దీంతో సోమవారం నుంచి ఆ గ్రామనికి ప్రభుత్వ అధికారులు క్యూ కట్టారు. సుమారు 10కోట్ల రూపాయల్తో పనులు ప్రారంభించారు. దీనంతటికీ ప్రధాన కారణమైన ఆ బాలికను అంతా ప్రశంసిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/