Begin typing your search above and press return to search.
స్కూళ్లు, కాలేజీలు బంద్ పై పునరాలోచించాలి !
By: Tupaki Desk | 24 March 2021 8:19 AM GMTతెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ ను తాత్కాలికంగా మూసివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తల్లిదండ్రుల నుంచి కూడా కరోనా విషయంలో ఆందోళన నెలకొందని వెల్లడించారు. వైద్యకళాశాలలు మినహా మిగతా అన్ని విద్యా సంస్థలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఈ అంశాలపై సమీక్షించిన తరువాత రాష్ట్రంలో కరోనా కేసులను నియంత్రించేందుకు బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు మూసివేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో బడులు మూసివేయాలని ప్రభుత్వానికి సూచించామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ మరోసారి కోరలుచాస్తోంది. ముఖ్యంగా స్కూల్స్, గురుకులాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే 700 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది.
అయితే , తెలంగాణాలో విద్యాసంస్థల బంద్ పై ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యల సంఘం ట్రస్మా విజ్ఞప్తి చేసింది. కరోనా మహమ్మారి పెరగకుండా కరోనా నియమాలు పాటిస్తూ విద్యాసంస్థలు కొనసాగించాలని ,పిఆర్ టియు అధ్యక్షుడు ,ప్రధాన కార్యదర్శి ప్రభుత్వాన్ని కోరారు. ఇంటర్ , డిగ్రీ కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులు నడపాలని,ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యం కోరుతుంది. మరి వీరి విజ్ఞప్తి పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.