Begin typing your search above and press return to search.
బడుల్లేవు మూత పడ్డాయి విలీన ద్రోహం!
By: Tupaki Desk | 6 July 2022 2:43 AM GMTనూతన విద్యావిధానం పేరిట కొంత, సరైన హాజరు లేదన్న కారణంతో కొంత రాష్ట్రంలో ఎనిమిదివేల బడులు మూతపడ్డాయి. కొత్త విద్యా సంవత్సరం ఆరంభంలోనే తల్లిదండ్రులకు ఈ దిగ్భ్రాంతికర నిర్ణయం తెలిసింది. దీంతో వీరంతా ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఇంతవరకూ గ్రామంలో ఉన్న బడి ఇప్పుడెక్కడికో తరలిపోయింది. తాజా నిర్ణయాలకు అనుగుణంగా చాలా మంది విద్యార్థులు తాము ఎటు పోవాలో తెలియక అయోమయంలో పడిపోయారు.
ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ నిన్నటి వేళ చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులను, పాఠశాలలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేశారన్న వాదన ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తోంది.
ప్రస్తుతం ఉన్న నలభై రెండు వేల పాఠశాలలు క్రమంగా పదకొండు వేలకు పరిమితం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా రేపటి వేళ జరిగేదే ఇది అని ఆయా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. వేసవి సెలవుల్లోనే విలీన ప్రక్రియ కానిచ్చేశారని మండిపడుతున్నాయి.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం, బండమీదజరావారిపల్లెలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలను రద్దు చేసి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలో కలిపేశారు. ఇక్కడున్న 110 మంది విద్యార్థులు అంతదూరం వెళ్లలేరని బడికి తాళం వేసి నిరసనలు తెలిపారు గ్రామస్థులు, తల్లిదండ్రలు.
ఇదేవ ఇధంగా తిరుపతి నాయుడుపేటలో మునిరత్నం కాలనీలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరు, ఏడు తరగతులు ఎత్తేసి సమీపాన ఉన్న పుదూరు జెడ్పీహెచ్ లో కలపడాన్ని నిరసిస్తూ విద్యార్థులు బైఠాయించారు.ఇదేవిధంగా అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ పలు చోట్ల నిరసనలు వ్యక్తం అయ్యాయి.
క్రమబద్ధీకరణ పేరిట బడుల విలీనంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉన్నాయి. మరోవైపు అధికారులు తగినంత హాజరు శాతం లేనందునే ఇక్కడి బడులను విలీనం చేస్తున్నామని చెబుతున్నారు.