Begin typing your search above and press return to search.
విద్యార్థులూ రెడీనా? రేపే స్కూళ్ల ఓపెన్
By: Tupaki Desk | 31 Jan 2021 2:01 PM GMTకరోనా లాక్ డౌన్ తో మూత‘బడి’న పాఠశాలలు రేపే తెరుచుకోనున్నాయి. తెలంగాణలో విద్యాసంస్థలు రేపటి నుంచి పున:ప్రారంభం కావడంతో విద్యార్థుల్లో సందడి నెలకొంది.
కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు, కాలేజీల్లో తరగతులు నిర్వహించనున్నారు. తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాల్సి ఉంది.
ఇక తరగతులకు విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్కూల్, కాలేజీలకు వెళ్లడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతారా? కరోనా భయానికి వెనకడుగు వేస్తారా? అన్నది వారి ఇష్టంపై ఆధారపడి ఉంది.
ప్రస్తుతం అయితే సంవత్సరకాలంగా ఇంట్లో ఉంటున్న విద్యార్థులు బోర్ కొట్టి చస్తున్నారు. వారు మాస్క్ లు, శానిటైజర్లు జేబులో వేసుకొని మరీ స్కూల్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లలను బడికి పంపడానికి జంకుతున్నారు. చూడాలి మరీ రేపటి నుంచి స్కూళ్లలో ఎలాంటి స్పందన ఉంటుందో..