Begin typing your search above and press return to search.
నవంబర్ 2 నుండి ఏపీలో స్కూల్స్ ఓపెన్ .. ఈ రూల్స్ పాటించాల్సిందే !
By: Tupaki Desk | 29 Oct 2020 4:30 PM GMTకరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన సమయంలో విద్యాసంస్థలు మూతబడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చినప్పటికీ , పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని స్కూళ్ల ప్రారంభానికి అనుమతులు ఇవ్వలేదు. ఇక తాజాగా నవంబర్ 2 నుండి మూతపడిన స్కూళ్లు, కాలేజీలో తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను చెప్పేలా ప్లాన్ రూపొందించారు. ఈమేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు.
నవంబర్ 2 నుంచి 9,10, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం , రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు హాఫ్ డే మాత్రమే నడపాలని నిర్ణయం తీసుకున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు. నవంబర్ 23 నుంచి 6,7,8 తరగతులకు క్లాసులు ప్రారంభం అవ్వనున్నాయి. ఇక, డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్ డే మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. ఈ రూల్స్ ను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు పాటించాల్సిందే అని ప్రభుత్వం తెలియజేసింది.