Begin typing your search above and press return to search.

ఆగస్టు 3 కాదు.. స్కూల్స్ ప్రారంభం అప్పుడే?

By:  Tupaki Desk   |   19 July 2020 6:50 AM GMT
ఆగస్టు 3 కాదు.. స్కూల్స్ ప్రారంభం అప్పుడే?
X
కరోనా వైరస్ వ్యాప్తి.. ఆ తర్వాత లాక్ డౌన్ తో చదువులు అటకెక్కాయి. స్కూల్స్ అన్నీ బంద్ అయిపోయాయి. మార్చిలో మూతబడిన జూన్ 12న ప్రారంభం కావాల్సిన పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారనే విషయంపై క్లారిటీ లేదు.

ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం తొలుత ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పున: ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే తాజాగా ఆగస్టు 3కు తెరవడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.తాజాగా మరో తేదిని ఖరారు చేసి అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.

ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ పున: ప్రారంభించనున్నట్టు కేంద్రానికి అధికారులు విన్నవించారు. జులై 15న రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రాంతాలతో పాఠశాలల సురక్షిత ప్రణాళికపై కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ క్రమంలోనే పాఠశాలల్లో మార్పులు చేర్చులపై కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ - తమిళనాడు రాష్ట్రాలు మాత్రం స్కూల్స్ పున: ప్రారంభంపై నిర్ణయం తీసుకోలేదు. బీహార్ - ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఆగస్టులో తెరవనున్నట్టు ప్రకటించాయి.