Begin typing your search above and press return to search.
ఆ గ్రహాంలో మూడు సూర్యోదయాలు
By: Tupaki Desk | 9 July 2016 4:58 AM GMTఅనంత విశ్వంలో అద్భుతాలెన్నో. సైన్స్ ఇంత పెరిగినా.. మనిషికి తెలిసినవి కొన్ని మాత్రమే. తెలుసుకోవాల్సినవి మరెన్నో. ఆ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ.. శాస్త్రవేత్తలు తాజాగా ఒక కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. భూమికి 340 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ కొత్త గ్రహంలో చాలానే ఆసక్తికర విశేషాలు ఉన్నాయి.
దీని బరువు బృహస్పతి కంటే నాలుగు రెట్లు ఉండగా.. ఈ గ్రహం మూడు నక్షత్రాల చుట్టూ తిరుతోందని గుర్తించారు. అంటే.. ఈ గ్రహానికి మూడు సూర్యుళ్లు ఉంటారన్న మాట. అంతేకాదు.. ఈ మూడు సూర్యుళ్ల పుణ్యమా అని నిత్యం మూడు సూర్యోదయాలు.. మూడు సూర్యాస్తమయాలు ఉంటాయి. కాకుంటే..ఈ గ్రహంలో ఒక రోజు అంటే.. మనిషి జీవిత కాలం కంటే ఎక్కువని అంచనా వేస్తున్నారు. ఈ గ్రహం వయసు 1.6 కోట్ల సంవత్సరాలుగా చెబుతున్నారు.
కొత్తగా కనుగొన్న ఈ గ్రహానికి హెచ్ డీ 131399ఏబీ అన్న పేరు పెట్టారు. అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయ పరిశోధకులు దీన్ని గుర్తించారు.ఇప్పటివరకూ కనుగొన్న అతి తక్కువ వయసున్న ఎక్సో గ్రహాల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు. అంతేకాదు.. ఈ గ్రహాన్ని ప్రత్యక్షంగా ఫోటోలు తీయగలిగారు. ఇక.. ఈ గ్రహం మీద ఉష్ణోగ్రతలు వింటే దిమ్మ తిరిగిపోవటం ఖాయం. ఈ గ్రహం మీద ఉష్ణోగ్రత జస్ట్ 580 డిగ్రీలు మాత్రమే. ఒక సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే మరో సూర్యుడు ఆస్తమిస్తూ ఉంటాడని చెబుతున్న శాస్త్రవేత్తలు.. ఇక్కడి ఏడాదిలో నాలుగో వంతు వరకూ సూర్యోదయంలోనే ఉంటుందని చెబుతున్నారు. అంటే.. ఈ గ్రహంలో రాత్రి అన్నది లేదనట్లేనని చెప్పక తప్పదు.