Begin typing your search above and press return to search.
10 కోట్ల ఏళ్ల నాటి వీర్యం దొరికిందా?
By: Tupaki Desk | 18 Sep 2020 5:30 PM GMT10 కోట్ల ఏళ్లనాటి జంతు వీర్యం..ఇప్పుడు దొరకడమా.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..పైగా ఇన్నేళ్లు ఇంకా వీర్యంలో జీవం ఇంకా ఉండటం నిజంగా ఆశ్చర్యమే. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ కు చెందిన శాస్త్రవేత్తలకు పీత జాతికి చెందిన శిలాజలంలో ఈ వీర్యాన్ని కనిపెట్టారు. పురావస్తు శాస్త్రవేత్తలకు పురాతన వస్తువులు, జంతువుల కళేబరాలు దొరకడం సహజమే. వాటి ఆధారంగానే నిత్యం పరిశోధనలు సాగుతుంటాయి. అటువంటి వాటి కోసం నిరంతరం వారు గాలిస్తుంటారు. అందువల్లే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తుంటాయి.
తాజాగా చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలు వింటే మనం ముక్కున వేలేసుకోకతప్పదు. ఏకంగా 10 కోట్ల ఏళ్ల నాటి జంతువు వీర్యాన్ని ఇటీవల మయన్మార్ దేశంలో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
పీత జాతికి చెందిన ఓ శిలాజంలో జంతువు వీర్యాన్ని వారు గుర్తించారట. ఈ జీవికి మయాన్ మార్సిఫిరిస్ అనే పేరుపెట్టినట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఈ జీవులు అన్నిరకాల నీళ్లలో ఉంటాయని వారు చెప్పారు. జీవపరిణామ క్రమానికి చెందిన ఎన్నో కొత్తవిషయాలు పరిశోధించేందుకు ఎన్నో ప్రపంచ దేశాలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు సాగిస్తున్నాయి. వారు ఈ పరిణామ క్రమంలో ఏ కాలంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో గుర్తించి వివరిస్తుంటారు. ఇప్పుడు దొరికిన ఈ జంతువు వీర్యం కూడా జీవపరిణామ క్రమానికి చెందిన కొత్త కొత్త విషయాలను కనిపెట్టేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పది కోట్ల యేళ్ళనాటి శిలజాలంలో ఇంకా ఆ జంతువు వీర్యంలో జీవం నిజంగా ఆశ్చర్యమే. బహుశా ఈ జీవి నీటిలో ఉన్నందు వల్లే వాటి అవశేషాలు లభించివుంటాయని చెబుతున్నారు.