Begin typing your search above and press return to search.

కరిగిపోతున్న హిమం.. దేనికి సంకేతం?

By:  Tupaki Desk   |   30 Jan 2019 10:15 AM GMT
కరిగిపోతున్న హిమం.. దేనికి సంకేతం?
X
గ్లోబర్ వార్మింగ్ పై మనిషి ఇప్పటికైనా మేలుకోకపోతే అంతే సంగతులని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లక్షా 15వేల ఏళ్లలో ఈ భూఖండంలో ఇప్పడున్నదే అత్యంత ఉష్ణోగ్రత కలిగిన శతాబ్ధమని ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటిక్ అండ్ ఆల్ పైన్ రీసర్చ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూగ్రహం క్రమంగా వేడిక్కిపోతుండటంతో మంచుకొండలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి. మరోవైపు అడవులు అంతరించిపోతున్నాయి. పెరిగిపోతున్న వేడితో హిమనదులు కరిగి లక్షల ఏళ్లుగా కప్పబడిన భూప్రదేశాలు బయటపడుతున్నాయి. దీనిపై సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కెనడాలోని బఫిన్ ద్వీపంలో 30 ప్రాంతాల నుంచి సేకరించిన మొక్కలపై సెమన్ పెండెల్టన్ అనే రీసెర్చర్ పరిశోధనలు చేశారు. ఈ మొక్కలు, నాచు దాదాపు 40వేల ఏళ్ల సంవత్సరాల క్రితం నాటివని ఆయన వెల్లడించారు. అంటే మంచు కరిగి ఇవి బయటపడ్డట్టు ఆయన తేల్చారు. మంచు ఎంత వేగంగా కరిపోతుందో దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చని.. ఇది మనవాళికి ఒకరకంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని తెలిపారు.

కొన్ని దశాబ్దాలుగా ఉష్ణోగ్రతలు అత్యంత వేగంగా పెరిగిపోతున్నాయని ఇది మానవాళికి ఆందోళన కలిగించే విషయమని ఆయన నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్ లో ప్రచురించారు. ఇప్పటికైనా మనిషి గ్లోబల్ వార్మింగ్ పట్ల తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించాడు. భూమి ఉంటేనే మనిషి మనుగడ సాధ్యం.. ఇప్పటికైనా మనవాళి గ్లోబల్ వార్మింగ్ పై మేల్కొని భవిష్యత్ తరాలకు భూమిని భద్రంగా అందించాలని కోరుకుందాం. లేకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదను. సో ప్లీజ్ సేవ్ గా ఎర్త్ అండ్ సేవ్ ది వరల్డ్..