Begin typing your search above and press return to search.
4 వేల ఏళ్ల నాటి లడ్డూల్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఎక్కడంటే?
By: Tupaki Desk | 28 March 2021 12:30 PM GMTఒకటి కాదు రెండు కాదు. ఆ మాటకు వస్తే వందేళ్లు కూడా కాదు. ఏకంగా నాలుగువేల ఏళ్ల నాటి లడ్డూల్ని తాజాగా గుర్తించారు శాస్త్రవేత్తలు. దీంతో.. వేల ఏళ్ల క్రితం ఎలాంటి ఆహారాన్ని అప్పటివారు తినేవాళ్లు అన్న విషయాన్ని తెలియజేసే సాక్ష్యం ఒకటి గుర్తించారు. రాజస్థాన్ లోని ఒక ప్రాంతంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో లడ్డూలాంటి పదార్థం ఒకటి లభించింది. వీటిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఎందుకంటే..అప్పట్లో వీటిని వివిధ ధాన్యాల్ని వినియోగించి.. అనేక రకాల ప్రోటీన్లతో నిండి ధాన్యంతో తయారు చేసినట్లుగా గుర్తించారు. లక్నోకు చెందిన బీర్బల్ సాహ్ని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్.. ఢిల్లీలోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంస్థలు కలిపి రాజస్థాన్ లోని బిన్ జోర్ ప్రాంతంలో ఉన్న హరప్పా నాగరికతకు సంబంధించిన ఒక ప్రాంతంలో ఎంతో కాలంగా పరిశోధనలు జరుపుతున్నారు.
ఇదిలా ఉంటే నాలుగేళ్ల క్రితం (2017లో) వారికి ఏడు లడ్డూలాంటి గుండ్రంగా ఉన్న పదార్థాలు లభించాయి. వాటిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల టీంకు.. ఇందులో రకరకాల ప్రోటీన్లు ఉన్న ఆహార పదార్థంగా గుర్తించారు. పరిశోధనల అనంతరం వీటిని 2600 బీసీ నాటివిగా గుర్తించారు. వీటిని చాలా జాగ్రత్తగా అప్పటివారు నిల్వ చేసినట్లుగా గుర్తించారు. అయితే.. వీటికి నీరు తగలటం వల్ల లేత వంకాయి రంగులోకి మారాయి.కానీ.. ఇంతకాలం ఆకారంగా అయినా ఉండిపోవటం విశేషంగా చెప్పాలి.