Begin typing your search above and press return to search.
బాత్రూమ్ అనుకుని తలుపు తీయబోయాడు
By: Tupaki Desk | 29 Sep 2015 10:30 PM GMTవిమానంలో ప్రయాణిస్తుండగా బాత్ రూంకి వెళ్లాల్సిన అవసరం వచ్చిందాయనకు... అందుకు ఎంత ఖర్చయ్యిందో తెలుసో.. దాదాపు 45 వేలు ఖర్చయింది... ఆశ్చర్యంగా ఉందా...? అలా అయితే.. విమానమెవరు ఎక్కుతారు? అనుకుంటున్నారా!!! ఇక్కడ జరిగిన సీను వేరులెండి.. అందుకే ఆయనకు అంత ఖర్చయింది.
ఎడిన్ బర్గ్ నుంచి ఆమ్ స్టర్ డామ్ కు వెళ్తున్న విమానంలో స్కాట్ లాండ్ కు చెందిన జిమ్ గ్యారీ అనే వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. విమానం 30 వేల అడుగుల ఎత్తున ఎగురుతున్నప్పుడు సడన్ గా బాత్ రూంకి వెళ్లాల్సిన అవసరమొచ్చింది. పాపం... నిద్రమత్తులో ఉన్నాడో నిజంగా తెలియదో కానీ, బాత్రూం డోర్ అనుకుని విమానం డోర్ తీయబోయాడు. అంతే సిబ్బంది వచ్చి అమాంతం సీట్లో కుదేశారు. అక్కడితో అయిపోయిందనుకున్నాడు... కానీ, వారు వదిలిపెట్టలేదు. ఆమ్ స్టార్ డామ్ వెళ్లడానికి ముందే షిపోలో విమానాశ్రయంలో ఆపి ఆయన్ను పోలీసులకు అప్పగించారు. అంతేకాదు... 600 యూరోలు అంటే సుమారు 45 వేల రూపాయలు ఫైన్ కట్టించుకున్నారు. అంతా అయిన తరువాత గ్యారీ మళ్లీ విమానం ఎక్కబోయాడు.. కానీ, అక్కడి అధికారులు అతణ్ని కిందకు దించేశారు. అయిదేళ్ల వరకు మళ్లీ తమ కంపెనీ విమానాల్లో ఎక్కకుండా నిషేధం విధించామని చెప్పారు.
దాంతో హాలిడేస్ ఎంజాయ్ చేయాలని వచ్చిన ఆయన డబ్బంతా పోగొట్టుకుని, అవమాన పడి, ఇబ్బంది పడ్డాడు. చివరకు వేరే విమానం పట్టుకుని ఆమ్ స్టర్ డామ్ చేరుకున్నాడు.