Begin typing your search above and press return to search.

మండలి రద్దుపై రాజ్యాంగం ఏమని చెబుతుంది?

By:  Tupaki Desk   |   24 Jan 2020 5:40 AM GMT
మండలి రద్దుపై రాజ్యాంగం ఏమని చెబుతుంది?
X
ఒక రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేయటం.. ఏర్పాటు చేయకపోవటం అన్నది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశం. కాకుంటే.. రాష్ట్రంలో లేని మండలిని ఏర్పాటు చేయాలన్నా.. ఉన్న దాన్ని తీసేయాలన్నా కేంద్రాన్ని ఒక మాట అడగటం.. దాని సాయంతోనే పని పూర్తి చేయాల్సి ఉంటుంది.

రాష్ట్ర అసెంబ్లీలో మండలిని ఏర్పాటు చేయాలన్నా.. రద్దు చేయాలన్నా తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలి. సభలో ఓటింగ్ నిర్వహించి.. సభలో ఉన్న వారిలో మూడింట రెండొంతులు మెజార్టీ రావాల్సి ఉంటుంది. అలా తీర్మానం చేసిన తర్వాత కేంద్ర పరిశీలనకు పంపి.. కేంద్ర మంత్రివర్గంలో చర్చ జరిపి తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటారు. అందులో ఓకే అయ్యాక.. పార్లమెంటులో బిల్లు పెట్టి.. ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత మాత్రమే మండలిని ఏర్పాటు చేయాలన్నా.. ఉన్న దాన్ని తీసేయాలన్నా సాధ్యమవుతుంది.

మండలి ఏర్పాటు.. తీసివేతకు సంబంధించిన ప్రొసీజర్ ఇలా ఉంటే.. రాజ్యాంగం ఏం చెబుతోందన్నది చూస్తే.. ఒక రాష్ట్రంలో కొత్తగా మండలిని ఏర్పాటు చేయాలన్నా.. ఇప్పటికే ఉన్న మండలిని రద్దు చేయాలన్నా రాజ్యాంగంలోని 169వ అధికరణకు లోబడే జరుగుతుంది. మండలి ఏర్పాటు లేదా రద్దుపై అసెంబ్లీ తీర్మానం మాత్రమే చేయగలగుతుంది. పార్లమెంటులో బిల్లు ద్వారానే కొత్తగా మండలి ఏర్పాటు కానీ.. రద్దు సాధ్యమని పేర్కొంది. ఇదంతా చూసినప్పుడు ఏపీలో మండలిని రద్దు చేయాలని జగన్ భావిస్తే.. జరిగిపోదు. దానికి భారీ ప్రొసీజర్ ఉంది. అన్నింటికి మించి కేంద్రంలోని మోడీ సర్కారును ఒప్పించగలగాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.