Begin typing your search above and press return to search.
షాకింగ్ నిజం.. పాటలు పాడటం.. గట్టిగా అరవటంతోనూ వైరస్ వ్యాప్తి
By: Tupaki Desk | 30 Aug 2020 5:50 AM GMTరోజులు గడుస్తున్నకొద్దీ కరోనా మహమ్మారికి సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా జరిపిన అధ్యయనంలో వెల్లడైన విసయాలు చూస్తే.. మరింత షాకింగ్ గా మారటం ఖాయం. పాజిటివ్ గా ఉన్న వ్యక్తులు వీలైనంత తక్కువగా మాట్లాడటం చాలా మంచిదని.. అలా చేస్తే వారిలోని వైరస్ పక్క వారికి అంటే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
వైరస్ వ్యాప్తికి సంబంధించి ‘‘ద బీఎంజే’’ జర్నల్ తాజాగా సరికొత్త అంశాల్ని ప్రస్తావించింది. అమెరికా.. బ్రిటన్.. చైనా లాంటి దేశాలతో పాటు.. మరికొన్ని దేశాల్లో తాము జరిపిన పరిశోధనల్లో కొత్త అంశాలు వెలుగు చూశాయి. దీని ప్రకారం గట్టిగా మాట్లాడటం.. పాటలు పాడటం.. పెద్దగా అరవటం లాంటి వాటి కారణంగా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉందని తేల్చారు.
ఈ నివేదిక ప్రకారం.. ఆఫీసులు.. ప్రార్థనా సథలాల్లో రిస్కు శాతం ఎక్కువగా తేల్చారు. అంతేకాదు వెంటిలేషన్ తక్కువగా ఉన్నచోట రిస్కు ఎక్కువగా తేల్చారు. ఇటీవల అమెరికాలో ఒక మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొన్న గాయకుడి ద్వారా 52 మందికి కరోనా వైరస్ సోకినట్లుగా తేల్చారు. పాజిటివ్ వ్యక్తులు కానీ.. రోగ లక్షణాలు ఉన్న వ్యక్తి గట్టిగా దగ్గినప్పుడుకానీ.. బలంగా తుమ్మినప్పుడు కానీ వారి నుంచి వచ్చే తుంపర్లు గరిష్ఠంగా తొమ్మిది మీటర్ల వరకు గాల్లో ప్రయాణిస్తాయని తేల్చారు.
మాస్కు ధరించిన వ్యక్తి మాట్లాడినా పెద్ద ప్రమాదం లేదు కానీ.. పాటలు పాడటం.. కేకలు వేయటం వల్ల మాత్రం వైరస్ వ్యాప్తికి అవకాశం ఉందని తేలింది. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో రిస్కు కొంచెం ఎక్కువని తేలింది. తాజా పరిశోధన నేపథ్యంలో వీలైనంత తక్కువగా మాట్లాడటం.. మాస్కు ధరించటం.. ఒకే ప్రదేశంలో ఎక్కువసేపు గడపకపోవటం చాలామంచిదని చెబుతున్నారు. సో.. బీకేర్ ఫుల్..