Begin typing your search above and press return to search.
తెరపై కి 'మంగళయాన్' విజయగాథ!
By: Tupaki Desk | 6 Aug 2022 6:02 AM GMTఅంతరిక్ష పరిశోధనల్లో భారతదేశ శక్తిసామార్ధాల్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పింది 'మంగళయాన్' మిషన్. అతి తక్కువ ఖర్చుతో భారత అంతరిక్ష పరిశో ధన సంస్థ ( ఇస్రో) రూపొందించిన ఈ మార్స్ మిషన్ తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా లక్ష్యాల్ని చేధించి అరుదైన ఘనత సొంతం చేసుకుంది.
45 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక 1,337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ 2013 నవంబరు 5- మధ్యాహ్నం 2.38 గంటలకు నింగిలోకి దూసుకెళ్ళింది. సుమారు రూ.455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇస్రో స్థాయిని పెంచిన అతి పెద్ద ప్రయోగంగా భావిస్తారు.
ఇప్పుడీ మంగయాన్ విజయగాథని డాక్యుమెంటరీ రూపంలో `యానం` టైటిల్ తో తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు వినోద్ మంకర. ప్రపంచ సినిమా చరిత్రలోనే మొట్ట మొదటి సైన్స్ సంస్కృత చిత్రమిది. ఇస్రో మాజీ చైర్మన్ కె. రాధాకృష్ణ నన్ రచించిన `మై ఒడిస్సీ: మెమోయిర్స్ ఆఫ్ ది మ్యాన్ బిహైండ్ ది మంగళ్ మిషన్` పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.
ఆగస్ట్ 12న ఈ చిత్రాన్ని చెన్నైలో ప్రదర్శితం కానుంది. సినిమా ప్రీమియర్ ని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ ప్రారంభిస్తారు. ఇస్రోతో పాటు అందులో పనిచేసిన శాస్ర్తవేత్తల శక్తి సామార్ధాలను ప్రపంచం ముందు ప్రదర్శించడమే ఈ డాక్యుమెంటరీ లక్ష్యంగా కనిపిస్తుంది. భారతీయ శాస్ర్త వేత్తలు అన్ని పరిమితుల్ని అధిగమించి..సంక్లిష్టమైన మార్స్ మిషన్ ని తొలి ప్రయత్నంలో ఎలా సాధించారో? `యానం` వివరిస్తుంది.
45 నిమిషాల గల డాక్యుమెంటరీ పూర్తిగా సంస్కృతంలో ఉంటుందని తెలుస్తోంది. ఇంత వరకూ ఇలాంటి ప్రయోగానికి ఏ దర్శకుడు పూనుకోలేదు. అదీ ఓ డాక్యుమెంటరీ రూపంలో తీసుకురావడం విశేషం. సినిమాగా చేస్తే వాస్తవాల రూపు రేఖలు మారిపోతాయి. డాక్యుమెంటరీ కాబట్టి ఆ స్కోప్ ఎక్కడా ఉండదు. ఉన్న వాస్తవాల్ని ఆవిష్కరించడానికే స్కోప్ ఉంటుంది.
అయితే ఇదే కథని అటుపై సినిమానూ మలిచే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఛాన్స్ ఓ బాలీవుడ్ దర్శకుడు తీసుకుంటున్నాడని తెలిసింది. ఇటీవలే నటుడు మాధవన్`రాకెట్రీ- దినంబీ ఎఫెక్ట్` టైటిల్ తో ఇండియన్ స్పేస్ దిగ్గజం నంబీ నారాయణ్ కథని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు.
మాధవన్ స్వీయా నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన సినిమా విమర్శకుల ప్రశసంలందుకుంది. అంతకు ముందు వరుణ్ తేజ్ హీరోగా `అంతరిక్షం` చిత్రాన్ని సంకల్ప్ అనే కొత్త కుర్రాడు తెరకెక్కించాడు. ఇది కూడా `అంతరిక్షం`లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగానే తెరెక్కించారు. ఈ సినిమాకి మంచి పేరొచ్చింది.