Begin typing your search above and press return to search.
అక్కడంతా గోల్డ్ మయం!
By: Tupaki Desk | 14 April 2015 5:06 AM GMTపెళ్లి కూతురు ధరించిన పట్టీలు, కాళ్లకు వేసుకున్న చెప్పులు... అంతెందుకు అసలూ అ పెళ్లిమండపమే బంగారం! అవును మీరు చదివింది నిజమే! బ్రూనే యువరాజు అబ్దుల్ మాలిక్ వివాహవేడుక... బ్రూనె రాజధాని బందర్ సెరీ బెగవాన్ లోని ప్యాలెస్ లో జరిగింది. ఈ వివాహానికి ఇంటర్నేషనల్ మీడియాలో ప్రచారం మామూలుగా జరగలేదు! పెళ్ళి కూడా ఆరేంజ్ లోనే జరిగిందనుకోండి.
వివరాల్లోకి వెళితే... బ్రూనె రాజు హస్సనల్ బోల్కాయీ కుమారుడైన 31 సంవత్సరాల అబ్దుల్ మాలిక్... డాటా అనలిస్టుగా పనిచేస్తున్న 22 సంవత్సరాల దయాంగను వివాహం చేసుకున్నారు. వీరి వివాహాం అంగరంగ వైభవంగా కోట్ల రూపాయల ఖర్చుతో అతిరధమహారథుల సమక్షంలో జరిగింది. ఖర్చు సంగతి మనకు అవసరంలేని విషయం కాబట్టి... పెళ్లి అంతా గోల్డ్ మయం! తినే ఆహార పదార్థాలు తప్ప మిగిలినవి అంతా బంగారంతో చేయించినవే అన్నా అది అతిశయోక్తి కాదేమో! ఈ పెళ్లివేడుకలకు ఉపయోగించిన్ కళ్యాణ మండపం, దంపతులు కూర్చున్న కుర్చీలు కూడా బంగారంతో చేసినవే. అదే సమయంలో పెళ్లి కూతురు దయాంగ కాళ్లకు వేసుకున్న చెప్పులు, పట్టీలు కూడా మొత్తం బంగారం, వజ్రాలతో చేయించారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది కచ్చితంగా బంగారు వివాహమే!