Begin typing your search above and press return to search.
ట్రంప్ నమ్మినబంట్లే దూరమవుతున్నారు
By: Tupaki Desk | 22 July 2017 9:41 AM GMTఒంటెత్తు పోకడలకు పెట్టింది పేరయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో షాక్ తగిలింది. ఇన్నాళ్లు కోర్టుల రూపంలో ఈ ఝలక్ ల పరంపర కొరగా తాజాగా సన్నిహితులు ట్రంప్ కు దూరం అవుతున్నారు. ఇటీవలి కాలంలో అమెరికా ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఒక్కొక్కరుగా తమ బాధ్యతలకు గుడ్ బై చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దికాలం క్రితం డొనాల్డ్ ట్రంప్ కమ్యునికేషన్ డైరెక్టర్ మైక్ డుబ్కే తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ రాజీనామా చేశారు. అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల స్పైసర్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
న్యూయార్క్ వ్యాపారవేత్త ఆంథోనీ స్కారాముకిని కమ్యూనికేషన్స్ డైరక్టర్ గా నియమించడంతో స్సైసర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కమ్యూనికేషన్స్ డైరక్టర్ ఆంథోనీకి రిపోర్ట్ చేయాలని ట్రంప్ కోరడంతో స్పైసర్ నిరాకరించారు. ఈ ఎపిసోడ్ ముదిరి పాకాన పడి స్పైసర్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా స్పౌసర్ మాట్లాడుతూ ``ట్రంప్ నిర్ణయాల వల్ల వైట్ హౌజ్ లో వ్యవస్థాగత లోపం ఏర్పడింది. ఒకే కిచెన్ లో ఎక్కువ మంది వంటగాళ్లు ఉంటే మంచిది కాదు`` అని స్పైసర్ అభిప్రాయపడ్డారు. కాగా, స్పైసర్ కు డిప్యూటీగా చేసిన సారా శాండర్స్ ఇప్పుడు ప్రెస్ సెక్రటరీగా చేయనున్నారు.
అయితే స్పైసర్ స్థానంలో మరోకొత్త వ్యక్తిని సామరస్యపూర్వక వాతవరణంలో నియమించాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని పెద్దగా హైలైట్ చేయకుండా వైట్ హౌస్ జాగ్రత్తపడుతోంది. కాగా, వైట్ హౌస్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు తమ పదవులకు రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. కమ్యూనికేషన్ డైరెక్టర్ మైక్ డుబ్కే, తాజాగా ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ రాజీనామా వెనుక ట్రంప్ తీరు కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు.