Begin typing your search above and press return to search.
భారతీయులకు షాకిచ్చిన ట్రంప్ మీడియా కార్యదర్శి
By: Tupaki Desk | 25 Jun 2017 6:29 AM GMTఒక దేశ అధ్యక్షుడికి మీడియా కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉండాలి? మరెంత అప్రమత్తంగా ఉండాలి?
కానీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మీడియా కార్యదర్శిగా వ్యవహరించే సియాన్ స్పైసర్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కీలక ప్రకటన చేసే ముందు కనీసం క్రాస్ చెక్ చేయాలన్న ఐడియా కూడా ఆయనకు రాదన్నట్లుగా ఆయన తీరు ఉంటుందని చెప్పాలి.
తరచూ తప్పులు చేసి నాలుక కరుచుకునే అలవాటున్న స్పైసర్ తాజాగా మరోసారి అలాంటి తప్పునే చేశాడు. అతగాడి తప్పు పుణ్యమా అని 130కోట్లకు పైనే ఉన్న భారతీయులకు షాక్ తినే పరిస్థితి. స్పైసర్ మైండ్‌కి ఏమైందో ఏమో కానీ.. రోజువారీ ప్రెస్ మీట్లలో ఆయన చేసిన ఒక ప్రకటన షాక్ తినేలా చేసింది.
ఎందుకంటే.. ఆయన తాజా వ్యాఖ్యను చూస్తే.. భారతీయులందరికి 70వ స్వాతంత్య్ర శుభాకాంక్షలు అని చెప్పాడు. ఆగస్టు 15న చెప్పాల్సిన శుభాకాంక్షల్ని.. ఊరికి ముందే చెప్పేయటం ఆశ్చర్యానికి గురి చేసింది. తర్వాత అర్థమైందేంటంటే.. ఇలా తప్పులు చేయటం స్పైసర్‌కు అలవాటే. తాజా శుభాకాంక్షలు సైతం అలాంటి తప్పేనని తేల్చారు.
దాదాపు రెండు నెలలు ఉన్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ముందే గ్రీటింగ్స్ చెప్పేసిన వైనంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. స్పైసర్ ట్రాక్ రికార్డు చూస్తే.. ఆయన తాజాగా ఇచ్చిన షాక్ చిన్నదనే చెప్పాలి. ఆ మధ్యన సిరియాలో జరిగిన రసాయన దాడి గురించి ఇదే స్పైసర్ మాట్లాడుతూ.. సొంత ప్రజలపైనే రసాయనిక దాడిని జరుపుకొని వందలాది మందిని పొట్టన పెట్టుకున్న దేశాధ్యక్షుడు బషీర్ అసద్.. హిట్లర్ కంటే దుర్మార్గుడని.. అతడు కూడా ఇంత దారుణానికి పాల్పడలేదంటూ షాకిచ్చాడు.
లక్షలాది మంది గ్యాస్ ఛాంబర్లలో పెట్టేసి క్రూరంగా చంపేసిన హిట్లర్‌కు స్పైసర్ ఇచ్చిన క్లీన్ చిట్ తో ప్రపంచం ఒక్కసారిగా షాక్ తింది. అయితే.. హిట్లర్ విషయంలో తాను చేసిన బ్లండర్‌ను గుర్తించిన ఆయన.. సారీ చెప్పారు. తాజాగా.. స్వాతంత్య్ర దినోత్సవానికి చాలాముందే శుభాకాంక్షలు చెప్పేసి అందరిని విస్తుపోయేలా చేసిన ఆయన అంత తప్పు చేయటానికి కారణం.. తాజాగా మోడీ చేపట్టిన అమెరికా పర్యటనగా చెబుతున్నారు. మోడీ అమెరికా టూర్ సందర్భంగా మాట్లాడుతూ.. స్పైసర్ ఈ దారుణ తప్పును చేశారని చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/