Begin typing your search above and press return to search.

భార్య కోసం సముద్రగర్భంలో వెదుకులాట .. ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   13 March 2021 10:30 AM GMT
భార్య కోసం సముద్రగర్భంలో వెదుకులాట .. ఏమైందంటే ?
X
భార్య భర్తల బంధం ఆ దేవుడు ముడి వేసిన బంధం. పెళ్లికి ముందు వరకు ఒకరికి ఒకరు తెలియకపోయినా కూడా పెళ్లి అనే మూడు ముళ్ల బంధం తో ఒక్కటైన క్షణం నుండి వారి మధ్య చిగురించే ప్రేమ ఇద్దరి ఆయువు గాల్లో కలిసిపోయేవరకు అలాగే ఉంటుంది. ఒకరికి ఒకరు అనేలా కలిసిమెలిసి ఉండటంతో .. వారిద్దరిలో ఏ ఒక్కరు ఈ లోకాన్ని విడిచి వెళ్లినా కూడా మరొకరు ఉండలేరు. అప్పటివరకు వారే తమ జీవితం అనుకుంటూ బ్రతికిన వారు అదే బాధలో వారు ఇంకా ఇక్కడే ఉన్నారు అంటూ అదే మైకం లో ఉంటారు. ఓ పెద్దాయన కూడా అంటే .. సునామి వచ్చి తన భార్య కనిపించకుండా పోయింది , సునామి వచ్చిన సమయంలో ఆమె ఉండే ప్రదేశం మొత్తం సముద్రంలో కలిసి పోయింది. అందరూ ఆమె చనిపోయింది అని అనుకుంటున్నారు. కానీ , తన భార్య చనిపోలేదు. ఎప్పటికైనా భార్య కనిపిస్తుందని నమ్ముతున్నాడు. ఆ నమ్మకంతోనే గత పదేళ్లుగా వెతుకుతున్నాడు. సముద్రాన్ని మొత్తం గాలిస్తున్నాడు. వారంలో ఆరు రోజులు సముద్రతీరాన్ని జల్లెడ పడుతూ, ఏడో రోజున సముద్రంలోకి వెళ్లి సముద్రగర్భంలో కూడా భార్య వెతుకుతున్నాడు .

వివరాల్లోకి వెళ్తే ... 2011లో జపాన్ లో వచ్చిన సునామీలో ఆయన భార్య కనిపించకుండా పోయింది. ఆమె ప్రతిరోజులాగే, సునామి వచ్చిన రోజున యేసువో భార్య బ్యాంకు కు వెళ్ళింది. ఆ తర్వాత తనకు ఇంటికి రావాలని ఉందని చెప్పి మెసేజ్ చేసింది. ఆ తరువాత ఏమైందో తెలియలేదు. యుకుషిమా నగరంలో వచ్చిన సునామీకి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంక్ కు దగ్గరలో ఓ కొండ ఉన్నది. అక్కడికి వెళ్లి ఉంటారని భావించిన పెద్దాయన ఆ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పట్టాడు. అయినా కూడా ఏం లాభం లేదు. సునామీ తరువాత అక్కడ ఒక బ్యాంక్ ఉన్నట్టుగా కూడా ఆనవాలు కూడా లేదు. మొత్తం సముద్రంలో కలిసిపోయింది భార్య లేదనే విషయాన్ని ఆ పెద్దాయన ఇప్పటికి నమ్మడం లేదు. ఎప్పటికైనా తిరిగి వస్తుందని నమ్ముతున్నాడు. తన శరీరంలో చివరి శ్వాస ఉన్నంత వరకు తన భార్య కోసం వెదుకుతూనే ఉంటాను అని చెప్తున్నాడు.