Begin typing your search above and press return to search.
తెలుగుదేశానికి పాతిక సీట్లు ఇస్తారా?
By: Tupaki Desk | 28 Aug 2018 2:30 PM GMTపొత్తులు - ఎత్తులు వ్యూహాలు ప్రతివ్యూహలకు సమయం వచ్చేసింది. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఎన్నికల శంఖం పూరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భావిస్తున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు - తమ బలాబలాలను ప్రత్యర్దుల బలహీనతలను అంచన వేసే పనిలో పడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. ఈ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పొత్తును కోరుకుంటోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంథీ ఈ పొత్తుకు తెర తీసారు.
దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రలలోను జాతీయ స్ధాయిలో భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు ఎవరితోనైన కలవాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగానే తెలంగాణలో అధికారికంగాను ఆంధ్రప్రదేశ్ లో అనాదికారికంగాను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రస్ పార్టీ నిర్ణయించింది. ముందుగా తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ పొత్తును ఖరారు చేసే పనిలో పడ్డారు . రానున్న ఎన్నికలలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి 25 శాతం కాంగ్రెస్ 75 శాతం స్దానాలను పంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రాధమికంగా నిర్ణయించింది అని వార్తలు వస్తున్నాయి . తెలంగాణలో 117 శాసనసభ స్థానాలున్నాయి. కాంగ్రెస్ లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా 25 నుంచి 30 స్దానాలు ఇవ్వలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒకటి రెండు స్దానాల దగ్గర వివాదాలు తెచ్చుకోవద్దని - కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు ఉద్భోదిస్తున్నారు అని అంటున్నారు .
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం కొరవడిందని కొన్ని జిల్లాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమయ్యిందని కాంగ్రెస్ భావిస్తోంది. పొత్తులో భాగంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదారబాద్ - నిజామాబాద్ - ఖమ్మం జిల్లాలలో సీట్లు కేటాయించాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం. అలాగే మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి కొంత బలముంది. దీంతో ఈ జిల్లాలలో కూడా మరికొన్ని స్దానాలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వవచ్చు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ పొత్తు కారణంగా అధికారంలోకి వస్తే మంత్రి పదవులు - వివిధ కార్పొరేషన్ పదవులు కూడా ఇరుపార్టీలు పంచుకోవాలని భావిస్తున్నారు. ఈ పొత్తులపై చర్చించేందుకు అహ్మద్ పటేల్ వంటి సీనియర్ నేతను చంద్రబాబు వద్దకు దూతగా పంపాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది.