Begin typing your search above and press return to search.
సెబాస్టియన్ ఫోనే అందరిని ముంచుతోంది!
By: Tupaki Desk | 8 Sep 2015 3:48 AM GMTఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఎంత ఇరుక్కున్నా సరే.. వారు ఏదో ఒక విధంగా ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, తమను ఈ కుట్రలో ఇరికించారని, చెప్పుకుని, డబాయించుకుని బయటపడడానికి మొన్నమొన్నటి వరకు ఆస్కారం ఉండేది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఏసీబీ పోలీసులకు పట్టుబడిన సెబాస్టియన్ ఫోను ఒక్కటే ఇందులో అందరినీ చాలా దారుణంగా ఇరికించేస్తున్నట్లుగా సాగుతున్న దర్యాప్తును బట్టి అర్థమవుతోంది.
సెబాస్టియన్ ఫోనులో జరిగిన సంభాషణల తాలూకు ఆడియో రికార్డులను ఏసీబీ పోలీసులు బయటపెట్టేవరకు ఈ కేసులో ఇరుక్కున్న వారు చెప్పే మాటలు ఒక విధంగా సాగాయి. సెబాస్టియన్ ఫోను సంభాషణలు బయటకు రాగానే.. కేసు పురోగతి మొత్తం షేపు మారిపోయింది. సెబాస్టియన్ ఫోనులో.. తాను మాట్లాడిన కాల్స్ దాదాపుగా ప్రతి ఒక్కటీ ఆయనే రికార్డు చేసుకుని ఉండడంతో వ్యవహారం చాలా ముదిరిపోయింది.
కాల్ డేటా సేకరించడమూ, ఫోన్లను ట్యాపింగ్ చేయడమూ వంటి వ్యవహారాలతో నిమిత్తం లేకుండా సెబాస్టియన్ స్వయంగా తాను మాట్లాడిన ఫోన్ కాల్స్ ను స్వయంగా దాదాపుగా అన్నిటినీ తనే రికార్డు చేసిపెట్టుకున్నారు. వాటిలో కొన్ని కీలకమైన ఫోను సంభాషణల్ని పోలీసులు తొలిదశలోనే గుర్తించారు. ఆయన ఫోన్ లో దాదాపు 500 ఫోన్ సంభాషణలు రికార్డయి ఉన్నాయిట. వీటన్నిటినీ పోలీసులు పరిశీలించి సుమారు వంద కాల్స్.. ఈ ఓటుకు నోటుకు సంబంధించినవి ఉన్నట్లుగా గుర్తించారు.
ఈ కాల్స్‌ను పూర్తిస్థాయిలో ఫోరెన్సిక్ ల్యాబ్ వారు విశ్లేషించడం వారు ప్రారంభించారు. కేవలం సెబాస్టియన్ ఫోను ఒక్కటే అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించే అస్త్రంగా తయారైందని అంతా అనుకుంటున్నారు. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరి పేర్లూ ఈ ఫోను సంభాషణల్లోనే దొరుకుతున్నాయని భావిస్తున్నారు. ప్రధానంగా లంచంగా ఇవ్వజూపిన 50 లక్షలు ఎక్కడనుంచి తెచ్చారనేది రాబట్టడం ప్రధానంగా ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.