Begin typing your search above and press return to search.
పుట్టిముంచిన సెబాస్టియన్ !
By: Tupaki Desk | 13 July 2015 6:04 AM GMTఓటుకునోటు కేసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన విషయం తెలిసిందే. గత నలబై రోజులుగా ఈ వ్యవహారం నుండి బయటపడేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావడం లేదు. ఇక ఏసీబీ విచారణలో రోజుకు ఒకటి వెలుగు చూస్తుండడం ఏ మాత్రం మింగుడు పడడం లేదు.
ఇక ఓటుకునోటు కేసులో ఎ2 నిందితుడు సెబాస్టియన్ కు ఉన్న ఒక్క అలవాటు మూలంగా ఈ కేసులో అందరూ ఇరుక్కున్నారు. ఇందులో ప్రస్తుతం అదే కీలకం కానుంది. సెబాస్టియన్ కు తనకు వచ్చే ప్రతి ఫోన్ ను రికార్డింగ్ చేసే అలవాటు ఉంది. మే 23 నుండి మే 31 వరకు సెబాస్టియన్ కు వచ్చిన ఫోన్లు అన్ని ఆయన హెచ్ టి సి ఫోన్ లో రికార్డయి ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు టేపులు బయటపడిన నేపథ్యంలో మాటలు ఆయనవేనా ? కాదా ? అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిర్ధారణకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు గొంతు అని నిర్ధారణ అయితే ఈ కేసులో ఈ ఫోన్ సంభాషణలు కీలకం కానున్నాయి. సెబాస్టియన్ కు ఉన్న ఒక్క అలవాటు ఇప్పుడు అందరి పుట్టి ముంచనుంది.