Begin typing your search above and press return to search.
ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ ... నీలం సాహ్నీ, గోపాలకృష్ణ ద్వివేదిలకు హైకోర్టు కీలక ఆదేశాలు !
By: Tupaki Desk | 22 Feb 2021 12:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి అయిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక ఎన్నికల నేపథ్యంలో తమకు సహకరించడంలేదంటూ మాజీ సీఎస్ నీలం సాహ్నీ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిలపై ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై గతంలో రెండు పర్యాయాలు విచారణ జరిగింది. తాజాగా మరోసారి నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు వీరిద్దరినీ తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. నీలం సాహ్నీ, గోపాలకృష్ణ ద్వివేది మార్చి 22న తమ ఎదుట హాజరుకావాలంటూ ఆదేశించింది. వీరిద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కి వాయిదావేసింది. గతంలో సీఎస్ గా వ్యవహరించిన నీలం సాహ్నీ పదవీ విరమణ అనంతరం ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు.
ఏపీ సర్కార్ స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో తనకు సహకరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అప్పట్లో ప్రభుత్వం ఎన్నికల విషయంలో ఎస్ఈసీకి సహకరించాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడం, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడం వంటి కారణాలతో అధికారులు కూడా ఎస్ఈసీకి సహకరించలేదు.
దీంతో ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాదాపు 40 రోజుల తర్వాత విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఆలస్యంగా పిటిషన్ రిజిస్టర్ కావడం వెనుక కారణాలపైనా విచారణ జరుపుతోంది. అదే సమయంలో ప్రభుత్వం ఎస్ఈసీ ఆదేశాలను పాటించకపోవడానికి కారకులైన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, అప్పటి సీఎస్ నీలం సాహ్నీలను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో వీరిద్దరి వివరణ కోరేందుకు వచ్చే నెల 22న హైకోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.