Begin typing your search above and press return to search.

రేషన్‌ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గిన ఎస్ఈసీ !

By:  Tupaki Desk   |   2 March 2021 8:36 AM GMT
రేషన్‌ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గిన ఎస్ఈసీ !
X
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే‌ వాహనాల రంగుల మార్పుపై ఏపీ ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. వాహనాల రంగు మార్చాలన్న ఆదేశాలను వెనక్కు తీసుకుంది.. దీంతో పిటిషన్‌ ను డిస్పోజ్ చేసింది. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలని ఎస్ ఈ సీ ఆదేశాలు ఇవ్వగా..దీనిపై ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. వాహనాల రంగులు మార్చాలంటే 3నెలల సమయం పడుతుందని, భారీగా ఖర్చవుతుందని.. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది అని కోర్టుకి తెలిపింది. ఈ పిటిషన్‌ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు రంగులు మార్చాలన్న ఎస్ ఈ సీ ఆదేశాలను సస్పెండ్ చేసింది.

ఇంటింటికీ రేషన్‌ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని జగన్ సర్కార్ కోర్టును కోరింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే పథకం ప్రారంభించామని.. దీన్ని అడ్డుకోకుండా ఎస్ ‌ఈసీని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న కోర్టు ఆ ఆదేశాలను సస్పెండ్ చేసింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. ఇప్పుడు ఆదేశాలను వెనక్కు తీసుకుంది. కాగా, ఫిబ్రవరి 5న ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో రంగులు మార్చకపోతే రేషన్ వాహనాలను తిప్పొద్దని ఎస్ఈసీ పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాహనాలకు వేసిన అధికార పార్టీకి చెందిన వైసీపీ రంగులు మార్చాలని ఎస్ఈసీ కోరిన సంగతి తెలిసిందే.