Begin typing your search above and press return to search.

జడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సంచలన ఆదేశాలు

By:  Tupaki Desk   |   18 Feb 2021 2:00 PM GMT
జడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సంచలన ఆదేశాలు
X
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్ఈసీ మరో అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్ ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశమిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈనెల 20లోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ పేర్కొంది.

గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను కూడా ఇవ్వాలని ఎస్ఈసీ పేర్కొంది. ఫిర్యాదులు లేకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనతో తెలిపింది.

గుంటూరు, కడప, చిత్తూరు, తిరుపతి నగర పాలిక సంస్థలో సింగిల్ నామినేషన్లపై అధికారులను రమేశ్ కుమార్ నివేదిక కోరారు. ఈనెల 20లోపు పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా రాజకీయ పక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే రమేశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.