Begin typing your search above and press return to search.

టీడీపీ మాజీ మంత్రి మెడకు ఉచ్చు బిగుస్తోందా?

By:  Tupaki Desk   |   5 March 2021 7:34 AM GMT
టీడీపీ మాజీ మంత్రి మెడకు ఉచ్చు బిగుస్తోందా?
X
ఏపీలో మరో మాజీ మంత్రి మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. తాజాగా ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అనంతపురం కోర్టు నిరాకరించడంతో అరెస్ట్ ఖాయమా అన్న సందేహాలు నెలకొంటున్నాయి. ఎన్నికల కమిషన్ పెట్టిన కేసులో టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ ఇప్పుడు ఇరుక్కుపోయారని అంటున్నారు.

గత ఏడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో కాల్వ శ్రీనివాస్ అనుచరులు, ముగ్గురు టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ముగ్గురు పిల్లలు ఉండడంతో వీరి నామినేషన్లు తిరస్కరించారు. దీంతో కాల్వ రంగంలోకి దిగి బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి...ఎన్నికల అధికారులను బెదిరించి టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్లు తీసుకోవాలంటూ కాల్వపై గతంలోనే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్వతోపాటు దౌర్జన్యం చేసిన 24మంది టీడీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదైంది.

ఇన్నాళ్లు ఈ కేసు విచారణ వేగవతం కావడంతో ముందస్తు బెయిల్ కోసం కాల్వ కోర్టును ఆశ్రయించగా ఆయన బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో కాల్వ అరెస్ట్ తప్పదన్న ప్రచారం సాగుతోంది.నాడు సకాలంలో పోలీసులు వచ్చి అధికారులను రక్షించారని.. కాల్వ శ్రీనివాస్ ఆధిపత్యం చూపించడానికి రచ్చ చేశాడని.. అధికారులపై దాడి చేశాడని.. అందుకే బెయిల్ నిరాకరిస్తున్నట్టు కోర్టు తేలింది.