Begin typing your search above and press return to search.
ఏపీలో కరోనా రెండో పాజిటివ్ కేసు
By: Tupaki Desk | 19 March 2020 5:11 AM GMTతెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతుండగా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కూడా పాకుతోంది. గతంలోనే ఒక పాజిటివ్ కేసు తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైంది. కరోనా వైరస్ బారిన మరొక వ్యక్తి పడ్డాడని అధికార వర్గాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండో కోవిడ్ 19 పాజిటివ్ కేసు నమోదైందని, అతడు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఆ యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతడికి పరీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ యువకుడిని ఒంగోలు రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.
మంగళగిరిలో ఓ యువతికి కరోనా లక్షణాలు ఉండడం తో వెంటనే గుంటూరులోని ఐడీ ఆస్పత్రికి తరలించారు. విదేశాల నుంచి నెల్లూరు కు వచ్చిన ఒక వ్యక్తికీ వైరస్ సోకగా అతడు ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. రెండో పాజిటివ్ కేసు నమోదవడం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా అనుమానాలు ఉంటే వెంటనే అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఈ సందర్భంగా విజయవాడ, తిరుపతి విమానాశ్రయం లో తనిఖీలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. పాఠశాలలు కళాశాలతో పాటు విశ్వ విద్యాలయాలు, కోచింగ్ సెంటర్లను కూడా మూసివేయించారు.