Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : మరో కుక్కకి కరోనా పాజిటివ్!
By: Tupaki Desk | 20 March 2020 12:50 PM GMTప్రపంచంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. గంటగంటకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ వల్ల ...10,033 మంది మృత్యువాత పడ్డారు. అలాగే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2,45 850 మంది కరోనా భాదితులు ఉన్నారు. అలాగే కాగా 87 వేలకు పైగా బాధితులు కరోనా నుంచి కొలుకుంటున్నారు. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 3,405. చైనా 3,245. ఇరాన్ 1,284. స్పెయిన్ 831. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 217కు చేరింది. ఇప్పటిదాకా దేశంలో కరోనా బారిన పడి ఐదుగురు మరణించారు. వారిలో నలుగురు భారతీయులు కాగా, ఇటలీ టూరిస్ట్ ఒకరు జైపూర్ లో చనిపోయారు.
ఇకపోతే , ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మనుషుల ప్రాణాలు తీసిన కరోనా వైరస్ ఇప్పుడు రూట్ మార్చింది. కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించింది, కానీ అదే కరోనా వైరస్ తిరిగి - ఇప్పుడు జంతువుల్లోనూ వ్యాపిస్తోంది. ఇప్పటికే హాంగ్ కాంగ్ లో ఒక పెంపుడు కుక్కకు కరోనా వైరస్ సోకింది. దీనిపై అప్పుడు హాంగ్ కాంగ్ ప్రభుత్వం కూడా స్పందించి ..ఆ కుక్కని వెంటనే ఐసోలేషన్ వార్డ్ కి తరలించి - చికిత్స అందించారు. అయితే , తాజాగా హాంగ్ కాంగ్ లోనే మరో కుక్కకి కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీనితో ఈ విషయాన్ని హాంగ్ కాంగ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మనుషులకి వస్తేనే ఈ వైరస్ ని తట్టుకోవడం కష్టంగా ఉంది ..ఇక జంతువులకి వస్తే మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది అని హాంగ్ కాంగ్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే , వాతావరణ మార్పుల్లో కారణంగా గాలిలో ఈ వైరస్ నోటి లేదా ముక్కు ద్వారా వ్యాపించే అవకాశం ఉంది. కరోనా వైరస్ పాజిటీవ్ లక్షణాలు ఉండటంతో ఆ కుక్కను జంతువుల ప్రత్యేక వైద్యకేంద్రానికి తరలించి పర్యవేక్షిస్తున్నారు. పెంపుడు జంతువుల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు భావిస్తే వాటిన్నింటిని ప్రత్యేకంగా నిర్బంధంలో ఉంచుతామని హాంగ్ కాంగ్ ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మనుషుల్లో ఒకరినుంచి మరొకరికి సోకుతూ పోతున్న క్రమంలో - రెండు పెంపుడు కుక్కల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడటంతో హంగ్ కాంగ్ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమౌతోంది.