Begin typing your search above and press return to search.
శుభవార్త : తగ్గుతున్న కరోనా కేసులు , మరణాలు..పెరిగిన రికవరీలు !
By: Tupaki Desk | 20 May 2021 10:30 AM GMTదేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుతున్నాయి. ఒకప్పుడు ప్రతి రోజు 4 లక్షలకు పైగా కొత్త కేసులు, 4వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. కానీ , ప్రస్తుతం 3 లక్షల కంటే తక్కువ కేసులు వస్తున్నాయి. అలాగే గత 24 గంటల్లో కరోనా బాధితుల మరణాల సంఖ్య కూడా కొంచెం తగ్గింది. భారత్ లో గడిచిన 24 గంటల్లో 2,76,110 కొత్త కేసులు నమోదయ్యాయి. వ్యాధి నుంచి 3,69,077 మంది కోలుకున్నారు. బుధవారం మరో 3,874 మంది మరణించారు. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గడం ఊరటనిచ్చే విషయం.
ఈ వివరాలతో మనదేశంలో కరోనా కేసుల సంఖ్య 2,57,72,440కి చేరింది. వీరిలో 2,23,55,440 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 2,87,122 మంది మరణించారు. మన దేశంలో 6 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులువస్తున్నాయి.
తమిళనాడులో 34,875, కర్నాటకలో 34,281, మహారాష్ట్రలో 34,031, కేరళలో 32,762, ఏపీలో 23,160, పశ్చిమ బెంగాల్‌లో 19,006 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 20,55,010 మందికి కరోనా పరీక్షలు చేశారు. దాంతో మనదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,23,56,187కి చేరింది. ఇక మనదేశంలో ఇప్పటి వరకు 18,70,09,792 డోసుల వ్యాక్సిన్ వేశారు.
కరోనా సెకండ్ వేవ్.. ఫస్ట్ వేవ్ కన్నా భయంకరంగా ఉంది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈసారి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని.. గాలి ద్వారా కూడా సంక్రమిస్తోందని శాస్త్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కట్టడికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను వాడడంతో పాటు ఇంట్లో వెంటిలేషన్ కూడా బాగా ఉండేలా చూసుకోవాలని, రెండు మాస్క్‌లు ధరిస్తే ఇంకా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు కోవిడ్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని అందరూ పాటించాలని.. అప్పుడే కరోనా మహమ్మారిని తరిమికొట్టగలమని స్పష్టం చేసింది. కరోనా రోగులు మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటి నుంచి తుంపర్లు బయటకు వస్తాయి. అవి 2 మీ. వరకు వ్యాపిస్తాయి. ఈ తుంపర్లతో రెండు రకాలు ఉంటాయి. పెద్ద తుంపర్లు నేరుగా కిందపడతాయి. అవి పడిన ప్రాంతాలను ముట్టుకొని, అదే చేతులతో ముఖం, నోటిని తాకితే కరోనా సంక్రమిస్తుంది. అందుకే ఇంటి లోపల ఫ్లోర్‌ను, తలుపు హ్యాండిల్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. చేతులను సబ్బులు, శానిటైజర్లతో క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న గాలి తుంపర్లతో ఎక్కువ ప్రమాదం ఉంది. అవి గాలిలో 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. కిటికీలు, తలుపులు మూసిఉండే గదుల్లో ఇవి ఎక్కువ సేపు ఉంటాయి. సరైన వెంటిలేషన్ ఉంటే వీటి నుంచి బయటపడవచ్చు.