Begin typing your search above and press return to search.
కరోనా అలర్ట్ తస్మాత్ జాగ్రత్త.. సెకండ్ వేవ్ మహిళలపై తీవ్ర ప్రభావం
By: Tupaki Desk | 12 May 2021 12:30 AM GMTకరోనా గత సంవత్సరం ఇండియాలో కరాళ నృత్యం చేసింది. రోజుకు వేలల్లో కేసులు నమోదు అవుతున్న సమయంలో బాబోయ్ అంటూ గుండెలు బాధుకున్నంత పని చేశాం. కాని ఆ సమయంలో రోజుకు మూడు నాలుగు లక్షల కేసులను ఊహించలేదు. కరోనా తగ్గి పోయిందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇతర దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ వచ్చినట్లుగా వార్తలు చూసి ఇండియాకు సెకండ్ వేవ్ భయం లేదని కొందరు భావించారు. కాని అనూహ్యంగా కరోనా సెకండ్ వేవ్ భారత్ ను ఒక కుదుపు కుదిపేస్తోంది. గత ఏడాదితో పోల్చితే కేసుల సంఖ్య రెండు మూడు రెట్లు అధికంగా నమోదు అవుతున్నాయి. ప్రస్తుత గణాంకాలు మహిళలు ఆందోళన పడే విధంగా ఉన్నాయి.
గత ఏడాదిలో కరోనా ఆడ మగ అనే తేడా లేకుండా అందరిని ఎఫెక్ట్ చేసింది. కాని ఈసారి మాత్రం గత ఏడాదిలో కరోనా కేసులతో పోల్చితే మహిళల్లో మరింత ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తో మహిళలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని వైధ్యులు అంటున్నారు. గడచిన ఏడాదిలో కరోనా ఐసీయూ అడ్మీషన్లలో 33 శాతం ఆడవారు ఉండగా ఈ సారి మాత్రం దాదాపుగా 40 శాతం ఆడవారు ఐసీయూ అడ్మీషన్స్ లో ఉన్నారు. దేశంలో కరోనా కేసుల్లో మగవారి శాతం ఎక్కువగా ఉంటుంది. కాని గతంలో పోల్చితే మాత్రం ఆడవారిపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు.
ఆడవారిలో మగవారితో పోల్చితే కాస్త ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. వారి ఆహారపు అలవాట్లు ఇతర అలవాట్ల కారనంగా కరోనా బారిన పడితే వారు ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ నిపుణులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో చూసినా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మహిళలు కరోనా బారిన పడటం అధికం అవుతుంది. అలాగే కరోనా తో ఐసీయూలో చేరడం కూడా అధికం అవుతుందని వైధ్యులు చెబుతున్నారు. అందుకే కరోనా తో మహిళలు మరింత జాగ్రత్త అవసరం అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.