Begin typing your search above and press return to search.
సెకండ్ వేవ్ షాక్.. పాతిక రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోందా?
By: Tupaki Desk | 12 May 2021 4:52 AM GMTకరోనా మొదటి వేవ్ కు.. రెండో వేవ్ కు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగా ఉంది. వైరస్ తీవ్రత విషయంలోనూ.. మొదట్లో మైల్డ్ గా ఉన్న వారి లక్షణాలకు.. సెకండ్ వేవ్ లో మైల్డ్ గా ఉన్న వారి లక్షణాలకు పొంతన లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. సెకండ్ వేవ్ బాధితులు తమ అనుభవాల్ని వెల్లడిస్తున్న వేళ.. వారి మాటల్ని వింటే.. తీవ్రత కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది.
మొదటి వేవ్ వేళ.. ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడినప్పటికి.. ఇప్పటిమాదిరి వెంటిలేటర్.. ఐసీయూ.. ఆక్సిజన్ బెడ్ల కొరత ఇంతలా వేధించలేదు. ఆక్సిజన్ కొరత కారణంగా ఇన్ని ప్రాణాలు పోయింది లేదు. సెకండ్ వేవ్ ను అంచనా వేసే విషయంలోనూ.. దాని తీవ్రతను మదింపు చేసే విషయంలో చోటు చేసుకున్న వైఫల్యానికి భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఇప్పటికి చెల్లిస్తున్న దుస్థితి. మొదటి వేవ్ లో.. ఆసుపత్రిలో చేరిన తర్వాత పది రోజులు ఉంటే చాలు.. పూర్తి స్వస్థతతో కోలుకునే వారు. కానీ.. సెకండ్ వేవ్ లో అలాంటి పరిస్థితులు లేవన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.
మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ లో కేసుల నమోదు ఎక్కువగా ఉండటంతో పాటు.. ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఎక్కువైందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం వైరస్ తీవ్రంగా మ్యూటెంట్ చెందటం.. దాని రూపు మార్చుకోవటంతో.. దానికి తగ్గట్లుగా వైద్యం చేయటం వైద్యులకు సవాలుగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న ఒక అంచనా ప్రకారం.. ఒక వ్యక్తికి రూపాంతరం చెందిన వైరస్ వ్యాపిస్తే.. కనీసం పాతిక రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వస్తోందన్న మాట వినిపిస్తోంది.
గతంలో వారం.. పది రోజులు ఎక్కువన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా మూడు.. నాలుగు వారాల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి రావటంతో.. ఖర్చు భారం తీవ్రంగా ఉంటోంది. దీంతో.. చాలామందికి ఈ వ్యవహారం ఆర్థికంగా పెనుభారంగా మారుతోంది. పన్నెండు రోజులుగా ఆక్సిజన్ సపోర్టులో ఆసుపత్రిలో వైద్యం చేసుకున్న వ్యక్తికి రూ.12లక్షలు ఇప్పటివరకు ఖర్చు కాగా.. మరో వారం పాటు ఆసుపత్రిలో వైద్యం తప్పనిసరి అని చెబుతున్నారని.. ఖర్చు అంచనా వేయలేని రీతిలో పెరిగిపోతుందని చెబుతున్నారు. మొదటి వేవ్ కు భిన్నంగా రెండో దశలో కరోనా బారిన పడిన వారిలో అనేక రుగ్మతలు కనిపిస్తున్నాయి.. ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండటం కూడా వారిలో ఆందోళనకు గురి చేస్తుందని చెబుతున్నారు. ఏమైనా.. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ చుక్కలు చూపిస్తున్న పరిస్థితి.