Begin typing your search above and press return to search.
ఏపీకి సెకండ్ వేవ్ ముప్పు.. ఎప్పటి నుంచి అంటే?
By: Tupaki Desk | 13 Dec 2020 4:15 AM GMTరోజుకు పదివేలకు పైగా పాజిటివ్ కేసులు ఏపీలో నమోదు కావటం తెలిసిందే. అలాంటి ఏపీలో ఇప్పుడు నమోదవుతున్న కేసులు ఎన్నో తెలుసా? కేవలం 600 మాత్రమే. భారీగా నమోదైన కేసులు.. గడిచిన కొద్దిరోజులుగా తగ్గిపోవటం.. వేలు కాస్తా వందల్లోకి దిగిపోవటం మంచిదే అయినా.. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితే ఉంటుందా? అన్నది సందేహంగా మారింది. అయితే.. కేసుల నమోదు తగ్గిందన్న సంతోషం కంటే కూడా.. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందన్న అంశం మీదనే ఎక్కువ ఆందోళనకు గురి చేస్తోంది.
తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం.. జనవరి15 తర్వాత నుంచి ఏపీకి సెకండ్ వేవ్ డేంజర్ ఉందన్న మాట వినిపిస్తోంది. చలి పెరిగే కొద్దీ తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు. తమిళనాడు.. ఢిల్లీ.. కేరళ లాంటి రాష్ట్రాల అనుభవాల్ని ఆధారంగా చేసుకొని సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందంటున్నారు.
కరోనాతో విలవిలలాడిన పలు దేశాలు.. మన దేశంలోని రాష్ట్రాల ఉదాహరణల్ని చూస్తే.. మొదటి.. రెండోవేవ్ మధ్య ఐదు నెలల గ్యాప్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ లెక్కన చూసినప్పుడు ఏపీలో ఆగస్టు.. సెప్టెంబరు మాసంలో తీవ్రత ఎక్కువగా ఉండి.. ఆ తర్వాత క్రమంగా తగ్గింది. ఈ లెక్కన చూసుకుంటే.. 2021 జనవరి 15నుంచి మార్చి 15 మధ్యన సెకండ్ వేవ్ కు అవకాశం ఉందన్న అంచనా వ్యక్తమవుతోంది. అలా అని సెకండ్ వేవ్ తప్పనిసరి అనుకోవద్దంటున్నారు.
అలా అని నిర్లక్ష్యంగా ఉండటం తగదు. అందుకే.. ముందస్తు జాగ్రత్తలు సెకండ్ వేవ్ విరుచుకుపడితే.. ఏమేం చేయాలన్న అంశాలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లుచేసుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా రద్దీ ప్రాంతాల్లో ప్రజలు విధిగా మాస్కు వాడేలా పోలీసులు చూడటంతో పాటు.. నూతన సంవత్సర వేడుకల్ని నిషేధించటం.. దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారికి ముందస్తు జాగ్రత్తగా టెస్టులు చేసి ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సెకండ్ వేవ్ లాంటి అపాయాన్ని ముందుగా అంచనా వేసుకొని.. అందుకు సిద్ధంగా ఉండటం మంచిదని చెప్పక తప్పదు.