Begin typing your search above and press return to search.
సెకండ్‌వేవ్ : మళ్లీ వీడియో కన్సల్టేషన్ ద్వారా చికిత్స !
By: Tupaki Desk | 19 April 2021 5:31 AM GMTదేశంలో మళ్లీ కరోనా జోరు ఊపందుకుంది. రోజురోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. దీనితో చిన్న అనారోగ్య సమస్య ఉన్నా కరోనా సోకిందేమో అనే అనుమానం వ్యక్తం అవుతుంది. అలాగే హోమ్ ఐసోలేషన్ లో ఎలా ఉండాలి అనే దానిపై స్పష్టత లేదు. దీనితో ప్రజలకు ఊరట కల్పించేందుకు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు మళ్లీ ఆన్ లైన్ వైద్యం, హోం ఐసోలేషన్ ప్యాకేజీలను ప్రారంభించాయి. 7 రోజులు, 14 రోజుల ప్యాకేజీలను ప్రవేశపెట్టాయి. హోం ఐసోలేషన్‌లో ఉండే కరోనా బాధితులకు వైద్య సేవలను అందించనున్నాయి. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు కూడా నిలిచిపోవడంతో పలు ఆస్పత్రులు ఆన్లైన్ లోనే చికిత్సలు, సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వేగంగా ఉండడంతో మళ్లీ దీని అవసరం ఏర్పడింది.
ఆన్ లైన్ వైద్య సేవలు అందించేందుకు గత ఏడాది లాక్ డౌన్ సమయంలో మొదలై , ఆగిపోయిన యాప్ లను మళ్లీ వాడుకలోకి తీసుకువస్తున్నారు. వీడియో కాల్ ద్వారా రోగులకు సదరు వైద్యుడు కనిపించి.. వారితో మాట్లాడి, వాడాల్సిన మందులను, అవసరమైన టెస్టులను సూచిస్తారు. ఇంటర్నల్ మెడిసిన్, పల్మనాలజిస్టు, డైటీషియన్, నర్సింగ్, సైకియాట్రిస్టు తదితర ముఖ్యమైన విభాగాలన్నింటినీ ప్రత్యేకంగా ఒకచోట ఏర్పాటు చేసి అవసరమైన వారికి సేవలందిస్తున్నారు. టెస్టులు చేయించుకోవాలనుకుంటే ఆస్పత్రి సిబ్బంది.. ఇంటికి వచ్చి చేస్తారు. ఇందుకు ప్రత్యేక చార్జీ వసూలు చేస్తారు. కేర్ ఆస్పత్రి 24 గంటలపాటు 'హోం సురక్ష' పథకాన్ని ప్రారంభించింది. 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్న రోగికి ఈ పథకంలో వైద్య సేవలు అందిస్తారు. ఇందుకు రూ.9 వేలు చార్జీగా నిర్ధారించారు.
ఈ ప్యాకేజీలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ తోపాటు కొవిడ్ కేర్ కిట్ అందజేత, ఇంటి వద్దనే రక్తనమునాల సేకరణ, ఇంటి వద్దకు మందుల స రఫరా, అవసరమైతే రోగిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించడం వంటి సదుపాయాలు ఉన్నాయి. అలాగే ఎం రెయిన్‌బో చిల్డ్రన్ ఆస్పత్రి, కిమ్స్,మెడికోవర్ ,కాంటినెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో 'కొవిడ్-19 హోం కేర్ సర్వీస్ 'ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్యాకేజీకి ఒక్కొక్క హాస్పిటల్ లో ఒక్క రేటు ఫిక్స్ చేశారు. దీనితో ఆన్ లైన్ వైద్యం.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి కొంత ఉపశమనం కలిగించనుంది. షుగర్, గుండె సంబంధిత సమస్యల వంటివి ఉన్నవారు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్పత్రి దాకా వెళ్లలేకపోతున్నారు. ఎప్పుడైనా కొత్త సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఉన్నారు. తాజాగా ఆస్పత్రులు మళ్లీ ఆన్‌లైన్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం వారికి కొంత ఉపశమనం లభించినట్లే.