Begin typing your search above and press return to search.

ఇవే.. ద‌మానీ స‌క్సెస్ సీక్రెట్స్

By:  Tupaki Desk   |   23 March 2017 6:12 AM GMT
ఇవే.. ద‌మానీ స‌క్సెస్ సీక్రెట్స్
X
నాలుగు రూపాయిలు సంపాదించిన వెంట‌నే.. అంద‌రికి తెలియాల‌న్న త‌ప‌న చాలామందిలో ఉంటుంది. ఎంత ఎదిగేకొద్దీ అంత పేరు ప్ర‌ఖ్యాతులు సొంతం చేసుకోవాల‌నుకోవ‌టం కామ‌న్‌. కానీ.. రాధాకిష‌న్ ద‌మానీకి మాత్రం ఇలాంటివి అస్స‌లు న‌చ్చ‌వు. ఇంత‌కీ ఈ రాధాకిష‌న్ ద‌మానీ ఎవ‌రా? అన్న డౌట్ వ‌చ్చిందా? డిమార్ట్ చెయిన్ స్టోర్స్ అధిప‌తి అంటే చ‌ప్పున గుర్తుకు వ‌స్తుంది. కేవ‌లం రోజు వ్య‌వ‌ధిలో దేశంలోనే మొనగాళ్లుగా ఉన్న బ‌డా బ‌డా పారిశ్రామిక‌వేత్త‌ల సంప‌ద‌ను బీట్ చేసి.. తాజా మార్కెట్ సంచ‌ల‌నంగా మారిన ద‌మానీకి సంబంధించిన ముచ్చ‌ట్లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఎందుకంటే.. ఎదిగే కొద్దీ ఆయ‌న మ‌రింత ఒదిగిపోవ‌ట‌మే కాదు.. త‌న‌కు సంబంధించిన వివ‌రాలు పెద్ద‌గా పంచుకోవ‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు.

ఎప్పుడు వైట్ అండ్ వైట్ లో కనిపించే 61 ఏళ్ల ద‌మానీకి ప్ర‌చారం అస్స‌లు ఇష్టం ఉండ‌దు. కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌టం కానీ.. మీడియాతో క‌ల‌వ‌టం కానీ చాలా అరుదు. ప్ర‌చారాన్ని అస్స‌లు కోరుకోని ఆయ‌న రోజు వ్య‌వ‌ధిలోనే పెద్ద పెద్ద జెయింట్ల సంప‌ద‌ను క్రాస్ చేయ‌టంతో ఇప్పుడు దేశ‌మంతా ఆయ‌న గురించి మాట్లాడుకుంటోంది. తండ్రి మ‌ర‌ణంతో.. సోద‌రుడితో క‌లిసి బ‌ల‌వంతంగా తండ్రి వ్యాపారంలోకి దిగాల్సి వ‌చ్చింది.

తొలుత స్టాక్ మార్కెట్లో స్పెక్యులేట‌ర్ గా ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర్వాతి కాలంలో దీర్ఘకాల దృష్టితో పెట్టుబ‌డులు పెట్ట‌టం మొద‌లెట్టారు. ఈక్విటీ మార్కెట్లో భార‌త్‌ లోనే మోస్ట్ వాల్యుబుల్ ఇన్వెస్ట‌ర్ గా పేరు ప్ర‌ఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. ఆయ‌న ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంద‌న్న పేరును తెచ్చుకున్న ఆయ‌న‌.. రిటైల్ రంగంలోకి అడుగు పెట్టాల‌ని భావించి.. డి మార్ట్ పేరుతో బ‌రిలోకి దిగారు. అంత‌కు ముందు వేరే కంపెనీలున్నా.. డి మార్ట్‌ ను కాస్త భిన్న‌మైన వ్యూహంతో సిద్ధం చేశారు.

రిటైల్ రంగంలో బిగ్ బ‌జార్‌.. రిల‌య‌న్స్‌.. హెరిటేజ్‌.. మోర్ లాంటివి చాలానే ఉన్నా.. డి మార్ట్ వ్య‌వ‌హారం వేరు. ఆయ‌న పెట్టిన స్టోర్లు అన్ని లాభాల్లో న‌డుస్తుండ‌ట‌మే కాదు.. ఆయ‌న పెట్టిన స్టోర్ల‌ను ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా న‌ష్టాల్లో ఉండ‌క‌పోవ‌టం విశేషం. అంతేకాదు.. పెట్టిన స్టోర్ల‌లో ఒక్క‌టి కూడా ఇప్ప‌టివ‌ర‌కూ లాభాల్లేవ‌ని మూసేయ‌లేదు. 2010లో 25 స్టోర్లు ఉన్న డిమార్ట్‌కి ప్ర‌స్తుతం 119 స్టోర్లు మాత్ర‌మే ఉన్నాయి. మిగిలిన చాలా రిటైల్ జెయింట్స్ తో ఉన్న షాపుల‌తో పోలిస్తే ఇవి త‌క్కువే. కానీ.. మిగిలిన వారి కంటే ఉన్న అన్ని స్టోర్లు లాభాల్లో ఉండ‌టం ఇక్క‌డి కీల‌కాంశం.

ద‌యానీ స‌క్సెస్ సీక్రెట్స్‌ను చెప్పాల్సి వ‌స్తే..

= తన వ్యాపారానికి కీల‌క‌మైన అమ్మ‌కందార్లు.. స‌ర‌ఫ‌రాదార్ల‌తో చ‌క్క‌టి సంబంధాలు పెట్టుకోవ‌టం. ఏ రోజు నో స్టాక్ అన్న బోర్డులు పెట్ట‌క‌పోవ‌టం.

= స్టోర్లుగా పెట్టే అన్ని భ‌వ‌నాలు సొంత భ‌వ‌నాల్లోనే ఏర్పాటు చేయ‌టం. దీనివ‌ల్ల భారీ అద్దెల భారం ఉండ‌కుండా చూసుకోవ‌టం. ఇదే.. లాభాలకు మొద‌టి మెట్టుగా మారుతుంది. ఇప్ప‌టివ‌ర‌కున్న అన్ని స్టోర్లు సొంత భ‌వ‌నాల్లో ఏర్పాటు చేసిన‌వే. లీజుకు తీసుకోవ‌టం అన్న‌ది ఉండ‌దు.

= రిటైల్ వ్యాపారంలో సామాన్లు సప్లై చేసే వారికి పేమెంట్స్ కాస్త ఆల‌స్యంగా ఇస్తుంటారు. కానీ.. డిమార్ట్ స్టోర్ల‌లో మాత్రం స‌రుకు తీసుకున్న వెంట‌నే.. రోజుల వ్య‌వ‌ధిలోనే పేమెంట్ ఇచ్చేయ‌టం.

= త్వ‌ర‌గా పేమెంట్స్ ఇచ్చినందుకు కంపెనీల నుంచి అద‌న‌పు డిస్కౌంట్ల‌ను తీసుకొని.. వాటిల్లో కొంత భాగాన్ని క‌స్ట‌మ‌ర్ల‌కు బ‌దిలీ చేయ‌టం. అందుకే మిగిలిన స్టోర్ల‌తో పోలిస్తే డిమార్ట్ స్టోర్ల‌లో వ‌స్తువుల ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉంటాయ‌న్న పేరును సొంతం చేసుకోగ‌లిగాయి.

= డిమార్ట్‌ను స్టార్ట్ చేసి 16 ఏళ్లు అవుతున్నా.. ద‌మానీ స్టార్ చేసే ఏ స్టోర్ కూడా పోటీ సంస్థ‌ల కంటే అధికంగానే లాభాలు పొంద‌టం ప్ర‌త్యేక‌త‌. త‌క్కువ విస్తీర్ణంలో ఎక్కువ వ‌స్తువుల్ని ఆక‌ర్ష‌ణీయంగా ఏర్పాటు చేయ‌టం.. ఆడంబ‌రాల‌కు పోకుండా అత్యంత జాగ్ర‌త్త‌గా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌టం.. ప్ర‌క‌ట‌ల మీద పెట్టే ఖ‌ర్చును వినియోగ‌దారుడికి త‌క్కువ రేటు పేరుతో బ‌దిలీ మీద‌నే ఫోక‌స్ పెట్ట‌టం.

= డిమార్ట్‌లో ఆఫ‌ర్లు ఉండ‌వు. డిస్కౌంట్లు మాత్ర‌మే ఉంటాయి. ఏ వ‌స్తువ అయినా స‌రే.. ఎమ్మార్పీ కంటే త‌క్కువ ధ‌ర‌కు ఉండ‌టం.. కొన్ని కంపెనీలు అమ్మ‌కం దార్ల‌కు ఇచ్చే ప్ర‌త్యేక రాయితీలో కొంత భాగాన్ని మాత్ర‌మే తాను ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని వినియోగ‌దారుల‌కు బ‌దిలీ చేయ‌టం. ఉద్యోగుల జీతాల విష‌యంలోనూ ఆచితూచి నిర్ణ‌యం తీసుకోవ‌టం. అవ‌స‌రానికి మించిన సిబ్బందిని.. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుకు అస్కారం ఇచ్చే విష‌యాల్ని అస్స‌లు ప్రోత్స‌హించ‌క‌పోవ‌టం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/