Begin typing your search above and press return to search.

ఏకంగా 13 కిలోలు తగ్గిన ఎలన్ మస్క్.. ఆ సీక్రెట్ ఇదేనట?

By:  Tupaki Desk   |   17 Nov 2022 11:30 PM GMT
ఏకంగా 13 కిలోలు తగ్గిన ఎలన్ మస్క్.. ఆ సీక్రెట్ ఇదేనట?
X
ఎలన్ మస్క్ కొన్ని నెలల కిందట గ్రీస్ లో ఈత కొలనులో షర్ట్ లేకుండా ఈదుతున్న ఫొటో చూసి అందరూ షాక్ అయ్యారు. అంత లావుగా, ఉబకాయంతో ఉన్నాడని చాలా మంది ఆడిపోసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఎలన్ మస్క్ చాలా సన్నబడ్డాడు. స్లిమ్ గా తయారయ్యాడు. ఏకంగా 13 కిలోలు తగ్గాడు.

ప్రస్తుతం ఎలన్ మస్క్ ట్విటర్ ను ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఉన్నతాధికారుల తొలగింపు నుంచి సంస్కరణల వరకూ అన్నీ చేస్తున్నారు. వరుసగా ట్విట్టర్ లో వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఎలన్ మస్క్ ప్రస్తుతం ఆరోగ్యంపై కూడా ధ్యాస పెట్టారట.. భారీగా బరువు కూడా తగ్గారు. ఇటీవల ఓ ట్విటర్ యూజర్ బరువు తగ్గడం ఎలా సాధ్యమైంది? ఆ రహస్యమేంటి? అని ప్రశ్నించగా.. ఆ రహస్యం బయటపెట్టాడు.

గ్రీస్ లో ఈత కొట్టే ఫొటో.. తాజా ఫొటోను ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేసి బరువు బాగా తగ్గారని ప్రశించాడు. దీనికి స్పందించిన ఎలన్ మస్క్ తాను దాదాపు 13 కిలోలు తగ్గినట్లు వెల్లడించారు. దానికి మూడు కారణాలు అంటూ బయటపెట్టాడు.

'ఉపవాసం, మధుమేహానికి సంబంధించిన రెండు ఔషధాలు, దగ్గరల్లో రుచికరమైన భోజనం లేకుండా చూసుకోవడం' చేశానని.. ఈ మూడూ తనకు బరువు తగ్గడంలో ఉపకరించాయని తెలిపారు.

ఇక ఓ స్నేహితుడి సలహా మేరకు తాను తరచూ ఉపవాసం ఉంటున్నట్లు వెల్లడించాడు. దీంతో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని వివరించాడు. అయితే ఈ ఔషధాల వల్ల తేన్నులు ఎక్కువగా వస్తున్నాయని.. సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉన్నట్టు తెలిపాడు.

మస్క్ గత ఆగస్టులోనే 9 కిలోలు బరువు తగ్గినట్టు తెలిపారు. దీనికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉపకరిస్తున్నట్టు తెలిపారు. మస్క్ పాటిస్తున్న ఈ విధానం అందరికీ ఫలితాలిస్తుందన్న గ్యారెంటీ లేదని వైద్యులు సూచిస్తున్నారు. మస్క్ ఔషధాలు ఖచ్చితంగా బరువు తగ్గిస్తాయని చెప్పలేమని తెలిపారు. శరీరతత్వాన్ని బట్టి బరువు తగ్గడానికి వివిధ పద్ధతులు అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.