Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ నిర్ణయం వెనుక అతడేనట..
By: Tupaki Desk | 19 Dec 2018 10:02 AM GMTరాజకీయాలైనా.. సినిమాలైనా అదృష్టం మీదే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. రాజకీయ నేత భవిష్యత్తును.. సినిమా తీసిన హీరో భవిష్యత్తును జనాలే డిసైడ్ చేస్తారు. ప్రజాభిప్రాయమే అంతిమ నిర్ణయం.. చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ కు ఈ లౌక్యం తెలుసు. అందుకే కుట్రలు- కుతంత్రాలు- ఎత్తులు - పైఎత్తులు పసిగట్టి ముందుగానే జాగ్రత్త పడ్డాడు..
తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి హాట్ సీటు.. ఇక్కడి నుంచి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినిని నిలబెట్టి చంద్రబాబు కుయుక్తులు పన్నారు. అటు హరికృష్ణ ఫ్యామిలీని.. ఇటు జనంలో సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుందామని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా అస్త్రశస్త్రాలు, డబ్బుల కట్టలు తెచ్చి పంచాడనే ఆరోపణలు వచ్చాయి. బాలయ్య కూడా సుహాసిని ని గెలిపించడానికి అన్నీ తానై వ్యవహరించారు. కానీ తమ్ముళ్లు అయిన ఎన్టీఆర్- కళ్యాన్ రామ్ మాత్రం అక్క సుహాసిని తరుఫున కూకట్ పల్లి లో ప్రచారం చేయలేదు. తారక్ తన ఫ్యామిలీ కోసమైనా పంతం వీడి వస్తారనుకున్నారు. కానీ ఎంత ఒత్తిడి వచ్చినా ఎన్టీఆర్ ప్రచారానికి రాలేదు. కానీ ఎన్టీఆర్ నిర్ణయమే కరెక్ట్ డెసిషన్ అని చివరకు తేలింది. కూకట్ పల్లి లో సుహాసిని ఓడిపోయింది.
అక్క ఓడిపోతుందని తారక్ కు ముందే తెలిసి ప్రచారానికి రాలేదని సమాచారం. ఎన్టీఆర్ కు అత్యంత ఆప్తుడైన ఒక మిత్రుడు సర్వే చేసి కూకట్ పల్లిలో సుహాసిని గెలువదని ఎన్టీఆర్ కు నివేదిక ఇచ్చాడట.. టీడీపీ తరుఫున ఎన్టీఆర్ ప్రచారం చేస్తే తెలంగాణ అభిమానులు కూడా హర్ట్ అయ్యే అవకాశం ఉందని.. చంద్రబాబు అవకాశావద రాజకీయాలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ కు సలహా ఇచ్చాడట.. అక్క కోసం ప్రచారానికి వెళ్లినా ప్రయోజనం ఉండదని స్నేహితుడు ఖచ్చితంగా చెప్పాడట.. దీంతో ఎన్టీఆర్ తోపాటు కళ్యాణ్ రామ్ కూడా అక్క సుహాసిని తరుఫున ప్రచారానికి దూరంగా ఉన్నారు..
అయితే ఇటీవల అబ్బాయి ఎన్టీఆర్- బాబాయ్ బాలయ్యలు కలిసారు. ఎన్టీఆర్ సుహాసిని ప్రచారానికి దూరంగా ఉండడంతో బాలక్రిష్ణ సీరియస్ గా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. వీరిద్దరి మధ్య చిగురించిన సంబంధాలు సుహాసిని వల్ల తెగిపోయాయని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు రాబోయే ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఆడియో వేడుక కు ఎన్టీఆర్ ను బాలయ్య ఆహ్వానిస్తాడా లేదా అన్నదాన్ని బట్టి వీరి మధ్య సంబంధాలు అర్థమవుతాయంటున్నారు.