Begin typing your search above and press return to search.

కొట్టుకున్న ఎంపీలు ప్రేమికులట

By:  Tupaki Desk   |   1 Aug 2016 10:44 AM GMT
కొట్టుకున్న ఎంపీలు ప్రేమికులట
X
తమిళనాడు రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి.. ప్రధాన పార్టీలు అన్నాడీఎంకే - డీఎంకేలు ఒకదానితో ఒకటి ఆగర్భ శత్రువుల్లా వ్యవహరిస్తాయి. ఆ పార్టీల్లో నేతలు కూడా అలాగే ఉంటారు.వ్యక్తిగతంగానూ శత్రువుల్లానే వ్యవహరిస్తారు. అలాంటి రెండు పార్టీల్లోని నేతల మధ్య ప్రేమ చిగురిస్తే.. అది కూడా లేటు వయసులో ఘాటు ప్రేమగా మారి ఎక్కడికో దారితీస్తే.. విచిత్రమే మరి. ఎవరూ ఊహించరు. కానీ, అలా జరిగింది.. చిన్న కొట్లాటతో అది బయటపడిపోయింది. నిన్న డీఎంకే ఎంపీని - అన్నా డీఎంకే ఎంపీ లాగిపెట్టి ఛెంప మీద కొట్టడం తెలిసిందే. ఎందుకలా కొట్టావంటే... జయలలితను దూషించాడని.. అందుకే కొట్టానని చెప్పింది. కానీ.. అప్పటికే వారిద్దరు గురించి తెలిసిన తమిళనాడులోని నేతలు కొందరు అసలు విషయం బయటపెడుతున్నారు.

నిన్న కొట్లాడిన ఇద్దరు ఎంపీలు మధ్య వివాహేతర సంబంధం ఉందని చెబుతున్నారు. ఇంతకాలం రహస్యంగా సాగినప్పటికీ … స్వయంగా వారే దాన్ని రచ్చచేసుకున్నారు. ఆదివారం ఢిల్లీఎయిర్‌ పోర్టులో డీఎంకేకు చెందిన ఎంపీ తిరుచ్చి శివను… అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్పా అందరూ చూస్తుండగానే రెండు చెంపలపై టపాటపామని వాయించింది. ఆ సమయంలో శివ కూడా ఏమీ మాట్లాకుండా వెళ్లిపోయారు. తమ పార్టీ అధినేత్రి జయలలితను దూషించినందుకే శివను కొట్టానంటూ శశికళ కలరింగ్ ఇచ్చారు. అయితే కొంతకాలంగా తమిళనాట సోషల్ మీడియాలో శివ - శశికళ చాలా సన్నిహితంగా, ఒకరి మీద మరొకరు కూర్చున్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకరి ఒడిలో ఒకరు పడుకుని.. కౌగిలించుకున్న ఫోటోలు ఉన్నాయి. ఈ సంబంధంలో వచ్చిన కోపతాపాల వల్లే శివను శశికళ కొట్టిందని చెబుతున్నారు.

తన పార్టీ ఎంపీ … ప్రత్యర్థి పార్టీ ఎంపీతో ఇలా వ్యవహారం నడుపుతున్న విషయం ఇప్పుడు జయలలితకు కూడా తెలియడంతో ఆమె ఫైర్ అయ్యారు. వెంటనే శశికళను పార్టీ నుంచి సోమవారం బహిష్కరించారు. జయను కలిసి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా అధినేత్రి శాంతించలేదు. పార్టీద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించారు. అయితే శశికళ సోమవారం రాజ్యసభకు హాజరయ్యారు. శివకు క్షమాపణ చెప్పారు. అదే సమయంలో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు.