Begin typing your search above and press return to search.

రీసార్ట్స్ లో గుట్టుగా వ్యభిచారం .. అడ్డాగా ఆ ప్రదేశాలు !

By:  Tupaki Desk   |   7 Aug 2021 11:30 PM GMT
రీసార్ట్స్ లో గుట్టుగా వ్యభిచారం .. అడ్డాగా ఆ ప్రదేశాలు !
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు అసాంఘీక కార్యకలాపాలకు నిలయాలుగా నిలుస్తున్నాయి. సాధారణంగా పర్యాటక ప్రదేశాలు అంటే పర్యాటకులు కుటుంబం తో కలిసి వచ్చి కాసేపు పని ఒత్తిడి లేకుండా హాయిగా గడిపి వెళ్తుంటారు. కానీ, ఇప్పుడు పర్యాటక ప్రదేశాలు అసాంఘీక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. దీనితో సామాన్య ప్రజలు భార్యాపిల్లలతో కలిసి సాయంత్రం వేళ కాసేపు కబుర్లు చెప్పుకునేందుకు వెళ్లే పార్కులు, బీచ్ లకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. దానికి కారణం అక్కడికి టూరిస్టుల ముసుగులో వచ్చే యువతీ, యువకులు రాసలీలల్లో మునిగిపోవడమే.

ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్లే టూరిస్ట్‌లకు ఈ తరహా పరిస్థితితో బహిరంగ ప్రదేశాలకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. ఇక, టూరిస్ట్‌ ల ముసుగులో తెరచాటున రిసార్ట్స్, లాడ్జ్‌ లు, హోటల్లో ఏకంగా వ్యభిచారాన్ని గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలను ఇలాంటి కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారని అధికారులు చెప్తున్నారు. జిల్లాలోని మచిలీపట్నం, విజయవాడ, కొండపల్లి ఖిల్లా వంటి ప్రాంతాలను అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నారుట. అటు, మచిలీపట్నం మంగినపూడి బీచ్‌ ను వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు కొందరు.

మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీ, యువకులు నిత్యం బీచ్ సందర్శనకు వచ్చి యధేచ్చగా రాసలీలలు కొనసాగిస్తున్నారు. రిసార్ట్స్, లాడ్జీలలో యువతీ, యువకులు, వివాహేతర సంబంధాలు కొనసాగించే జంటలు, చెడు ప్రవర్తన కలిగిన మహిళలు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రీసార్ట్స్ లో పర్యాటకులను ఆకర్షించి, గంటకు రూ.1000 చొప్పున వసూలు చేసి రాసలీలలు గుట్టు చప్పుడు కాకుండా లోపల్లోపలే కానిచ్చేస్తున్నారు. రిసార్ట్స్ నిర్వాకం పై సమాచారం అందుకున్న పోలీసులు, సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు.. దీంతో పోలీసులను చూసి ఖంగుతిన్న జంటలు, కొందరు తోటల్లోకి పరుగులు తీయగా మరికొందరు రూమ్ లలోని బాత్రూమ్ లకు వెళ్లి దాక్కున్నారు. అనుమానాస్పదంగా చిక్కిన 8 జంటలను పోలీసులు స్టేషన్ కు తరలించారు. పట్టుబడ్డ వారిలో కొందరు ప్రముఖులు, మరికొందరు ప్రజాప్రతినిధుల వద్ద పని చేసే వ్యక్తులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందట.