Begin typing your search above and press return to search.
వెల్లడైన సీక్రెట్ సర్వే రిపోర్ట్ ... సిట్టింగుల కు కష్టమే !
By: Tupaki Desk | 4 Jan 2020 6:49 AM GMTప్రస్తుతం తెలంగాణ నేతలు అందరూ మున్సిపల్స్ ఎన్నికలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అయితే , గులాబీ బాస్ ఒక సీక్రెట్ సర్వే చూపించారు. అసలు ఏ ఏ స్థానాలలో టి ఆర్ ఎస్ బలంగా ఉంది. ఏ ఏ స్థానాల్లో నువ్వా నేనా అన్న పోటీ ఉంది అని తెలుసుకోవడానికి ఈ సర్వే చేయించారు. ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు బయటపడటంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గులాబీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. టిక్కెట్ వస్తుందో రాదో అనే ఆందోళన వారిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సగానికి పైగా సిట్టింగ్ ల పని తీరు బాగోలేదని హైకమాండ్ సర్వేలో తేలింది. దీంతో సిట్టింగ్ లకు ఈసారి టికెట్స్ కష్టమే అని వార్తలు వినిపిస్తుండటం తో నేతల్లో టికెట్ల టెన్షన్ పట్టుకుంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో ఒక కార్పొరేషన్ తో పాటు ఆరు మునిసిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ గా టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాల కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసినట్లే..మునిసిపాలిటీల్లోనూ గులాబీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనితో పక్క వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. కొన్ని చోట్ల గట్టి పోటీ ఉండడంతో.. గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న ఎమ్మెల్యేలు, అభ్యర్థులు ఎవరైతే బాగుంటుదనే అంశంపై ఇంటర్నల్ సర్వే చేపట్టారు. డివిజన్ల వారీగా, అభ్యర్థుల వారీగా ఈ సర్వే జరిగినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా సిట్టింగుల పై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేతలను పక్కన పెట్టి, వారి స్థానాలలో వేరే వారికి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు తెలుస్తుంది. సిట్టింగ్‌లకు రిజర్వేషన్లు అనుకూలంగా రాకుండా ఎమ్మెల్యేలు జాగ్రత్తపడుతున్నారట. దీంతో వారికి టికెట్‌కు చెక్ పెట్టవచ్చు. వారు వేరే పార్టీ తరపున పోటీ చేయకుండా చేయవచ్చు అనే ఆలోచన చేస్తున్నారట. మిగతా మునిసిపాలిటీల పరిస్థితి ఎలా ఉన్నా..నిజామాబాద్ కార్పొరేషన్‌లో మెజార్టీ సిట్టింగ్‌ల కు టిక్కెట్లు దక్కే ఛాన్స్ లేదని ఆ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో డివిజన్లు 60కి పెరిగాయి. సమీప 9 గ్రామాల విలీనంతో చాలా డివిజన్ల సరిహద్దులు మారాయి. దీంతో రిజర్వేషన్లు సైతం పూర్తిగా మారే అవకాశం ఉంది. ఇటు రిజర్వేషన్లు అనుకూలించక… అటు సర్వేలో అనుకూల ఫలితాలు రాకపోవడంతో సగం మంది సిట్టింగ్‌లు ఇప్పుడు పక్క పార్టీ లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.