Begin typing your search above and press return to search.
ప్రాచీనగుడిలో గుప్తనిధులు.. అవి మావంటే మావని వాదనలు!
By: Tupaki Desk | 13 Dec 2020 12:49 PM GMTతమిళనాడు ప్రాంతంలో పూర్వం రాజ్యాల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఆనాటి రాజులు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఆలయాలు కట్టించారు. పేరు పొందిన రాజులు కట్టించిన ఆలయాలు ఆ రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి.
అప్పటి రాజులు ఆలయాల అభివృద్ధి కోసం గుడి గోడల్లో ఎక్కువగా బంగారం, మణులు, మాణిక్యాలు పెట్టేవారు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ తమిళనాడులోని ఏదో ఒక ప్రాంతంలో ఏ ఆలయం దగ్గరో బంగారం దొరికినట్లు తరచూ వింటూనే ఉంటాం.
తాజాగా తమిళనాడులోని ఓ ప్రాచీన ఆలయంలో తవ్వకాలు జరుపుతుండగా 2 కిలోల బంగారం బయటపడింది. ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. కాంచీపురం జిల్లా ఉత్తరమేరుర్‌లో కుళంబేశ్వరాలయం అనే ప్రాచీన దేవాలయం ఉన్నది. ఇక్కడ తవ్వకాలు జరుపుతుండగా.. బంగారు నాణేలు, నగలు కనిపించాయి. దీంతో స్థానికులు వెంటనే పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఈ బంగారు నాణేలను పరిశీలించారు. ఈ ఆలయం పల్లవుల కాలం నాటిదని సమాచారం. అక్కడ బయటపడ్డ నాణేలు కూడా పల్లవుల కాలం నాటివే.
అయితే ప్రస్తుతం ఈ నిధుల విషయంపై ప్రభుత్వ అధికారులకు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు వివాదం తలెత్తింది. ఈ గుడి దేవాదాయశాఖ పరిధిలో లేనందున బంగారం ట్రస్టుకే ఇవ్వాలని ట్రస్ట్ సభ్యులు వాదిస్తున్నారు. పురాతన ఆలయం కనుక నగలు ఇచ్చేయడం కుదరదని అధికారులు వాదిస్తున్నారు. అయితే ఈ బంగారం ఇక్కడ ఎవరు ఉంచారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. బహుశా ఆలయ నిర్మాణ సమయంలో రాజులే ఆలయ గోడల్లో ఉంచి ఉండొచ్చని అంటున్నారు.