Begin typing your search above and press return to search.

ఈఎస్ ఐ స్కాంలో కొత్త ట్విస్ట్.. ఆ ఉద్యోగులు పరార్

By:  Tupaki Desk   |   19 Jun 2020 3:04 PM GMT
ఈఎస్ ఐ స్కాంలో కొత్త ట్విస్ట్.. ఆ ఉద్యోగులు పరార్
X
ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాంలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత అచ్చెన్నాయుడు సహా ఈఎస్ఐ అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఇప్పుడు ఈ స్కాం జరగడానికి మూలపురుషులుగా సహకరించిన నాటి సచివాలయ ఉద్యోగుల గురించి శూలశోధన మొదలు పెట్టారు. అయితే తాజాగా ఈ కేసులో అనూహ్యమైన ట్విస్ట్ నెలకొంది.

ఏసీబీ అధికారుల విచారణలో ఈఎస్ఐ భారీ స్కాం వెనుక కొందరు నాటి చంద్రబాబు ప్రభుత్వంలోని సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 8మంది ఈ స్కామ్ కు సహకరించినట్టు ప్రాథమికంగా తేల్చారు. అయితే వారి కోసం ఆరాతీయగా వారందరూ పరారీలో ఉన్నట్టు తెలిసింది. వారి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో వారు అందుబాటులో లేకుండా పోయారు.

ప్రస్తుతం వారి కాల్ డేటా..సిగ్నల్స్ ఆధారంగా వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏసీబీ అధికారులు. వీరే ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించినట్టు ఏపీబీ అధికారులు తేల్చారు.

ఈ ఈఎస్ఐ స్కాంలో ఉన్నతాధికారుల వద్దకు నోట్ ఫైల్ పంపకుండా ప్రక్రియను ముందుకు వెళ్లడానికి నాటి సచివాలయ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేసేందుకు.. విచారించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేకుండా పోయారని తేలింది.