Begin typing your search above and press return to search.

జూనియర్ ని టచ్ చేస్తే సీక్రేట్స్ బద్ధలవుతాయి...

By:  Tupaki Desk   |   12 Oct 2022 4:36 PM GMT
జూనియర్ ని టచ్ చేస్తే సీక్రేట్స్ బద్ధలవుతాయి...
X
జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లో లేరు. ఆయన వయసు గట్టిగా నాలుగు పదులు మాత్రమే. ఏదో తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్నారు. కనీసం జూనియర్ వర్తమాన రాజకీయాల మీద పత్రికలు అయినా ఆసక్తిగా చదువుతారా అన్నది కూడా ఎవరూ చెప్పలేరు. ఎవరు అవునన్నా కాదన్నా జూనియర్ టాలీవుడ్ టాప్ స్టార్. రేపటి రోజు ఆయనదే. తన భవిష్యత్తు ఏంటో కచ్చితంగా తెలిసిన మనిషి జూనియర్.

అలాంటి జూనియర్ మీద అమరావతి రైతుల పాదయాత్రలో ఒక మహిళ నోరుపారేసుకుని అసభ్యంగా అనుచితంగా కామెంట్స్ చేయడం నిజంగా చరకు రచ్చకు తావిచ్చింది. దాని మీద ఇప్పటికే మాజీ మంత్రి జూనియర్ సన్నిహితుడు కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. జూనియర్ ని తిట్టిపోసి లోకేష్ కి టీడీపీ పట్టం కట్టడానికే చంద్రబాబు తాపత్రయం అంతా అని ఘాటైన విమర్శలు చేశారు. టీడీపీలో జూనియర్ కి ఏ మాత్రం పాత్ర లేకుండా చేసే కుట్ర అని కూడా కామెంట్స్ చేశారు.

ఇపుడు జూనియర్ కి మరో సన్నిహితుడుగా పేరు మోసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా గట్టిగా రియాక్ట్ అయ్యారు. అసలు జూనియర్ ని ఎందుకు విమర్శలు చేస్తున్నారు. ఆయనకు అమరావతికి ఏంటి సంబంధం. జూనియర్ ఎన్టీఆర్‌ని రాజధాని అమరావతికి ఎందుకు లాగుతున్నారు, జూనియర్ ని అడిగి ఏమైనా రైతులు భూములు ఇచ్చారా అని గట్టిగానే తగులుకున్నారు ప్రతీ వారికీ జూనియర్ ని విమర్శించడం అలవాటుగా మారింది అని వంశీ పెద్ద నోరే చేశారు.

ఇవన్నీ పక్కన పెడితే జూనియర్ ని సెల్ఫ్ మేడ్ మాన్ గా అభివర్ణించారు. జూనియర్ తాను స్వయంగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఆయన పెళ్ళి విషయంలో కూడా ఎవరి పాత్ర సాయం లేదని, అంతా జూనియర్ తానుగానే అన్నీ చేసుకుని వెళ్లారని మరో కొత్త విషయం చెప్పారు. నిజానికి చూస్తే చంద్రబాబు మేనకోడలు కూతురిని జూనియర్ చేసుకున్నారు. ఈ విషయంలో బాబు సాయం చేశారని ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. అదంతా తప్పు అని గట్టిగా వంశీ చెప్పారన్నమాట.

అలాగే తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2009 సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ని కరివేపాకులా వాడుకున్నారని, ఆ తరువాత సైడ్ చేశారని వంశీ ఘాటైన విమర్శలు చేశారు. జూనియర్ ఎదుగుదలలో ఎవరి ప్రమేయం లేదు అంతా ఒక్కడి కష్టం అని కూడా జూనియర్ గురించి చెప్పారు. ఇక జూనియర్ ని టచ్ చేయాలని చూస్తే చాలా సీక్రెట్స్ చెప్పాల్సి వస్తుందని వంశీ హెచ్చరించడమే ఇక్కడ విశేషం. జూనియర్ జీవితంలో ఉన్న అంత‌ర్గత రహస్యాలు కనుక బయట పెడితే మాత్రం చాలా మందికి నిద్ర కూడా పట్టదు అంటూ వంశీ ఎక్కడో భయం పుట్టించేశారు.

మరి ఎవరికి నిద్ర పట్టదు, జూనియర్ జీవితంలో ఉన్న అంత కీలక రహస్యాలు ఏంటి, వాటి వెనక ఉన్న ఇబ్బందులు ఏంటి విలన్లు ఎవరు, నిద్ర లేకుండా చేసే ఆ సీక్రేట్లు బద్ధలు కొట్టాల్సి వస్తుందని వంశీ హెచ్చరించడమేంటి ఇవన్నీ చర్చలే. ఇప్పటిదాకా జూనియర్ విషయంలో ఒకే కోణాన్ని సమాజం అంతా చూస్తోంది. మరి ఆ రెండవ కోణం చాలా సీక్రేట్స్ తో ఉందని వల్లభనేని చెప్పారు అంటే కచ్చితంగా జూనియర్ విషయంలో చెడుగుడు ఆడుతున్న వారికే తాకేలా ఉంటాయని అనుకోవాలేమో.

మొత్తానికి ప్రతీ చిన్న విషయానికి జూనియర్ ని ముడిపెడుతూ ఆయన్ని పొలిటికల్ ర్యాంగింగ్ చేస్తూ వస్తున్న పచ్చ మూకకలు ఒక్క దెబ్బతోనే వంశీ గట్టి వార్నింగ్ ఇచ్చారనుకోఅలనే అంటున్నారు. మొత్తానికి వెండి తెర కధానాయకుడిగా ఎన్నో పాత్రలు పోషించిన ఎన్టీయార్ జీవితంలో ఉన్న రహస్యాలు ఏంటో మరోసారి ప్రెస్ మీట్ పెట్టి వంశీ రివీల్ చేస్తే తప్ప తెలియదు అంతే. అయినా అంతవరకూ అవతల వారిని తెచ్చుకోవద్దు అని వంశీ వార్నింగ్ ఇచ్చారు కదా వారు సైలెంట్ అవుతారా. లేక పీకి పీకి తొడపాశం పెట్టించుకుంటారా ఏమో చూడాలి మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.