Begin typing your search above and press return to search.

హైకోర్టు మాట; సెక్షన్‌ 8 అమల్లోనే ఉందిగా..!

By:  Tupaki Desk   |   29 Jun 2015 12:55 PM GMT
హైకోర్టు మాట; సెక్షన్‌ 8 అమల్లోనే ఉందిగా..!
X
విభజన చట్టంలోని సెక్షన్‌ 8ని అమలు చేయాలన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్‌ కో. ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షన్‌ 8 అమలు చేయాల్సిన అవసరమే లేదన్నది తెలంగాణ అధికారపక్షం వాదన. ఇదిలా ఉంటే.. సెక్షన్‌ 8.. ఓటుకు నోటు కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని న్యాయవాది వేసిన ఒక పిటీషన్‌ను కొట్టి వేసిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య చేసింది.

హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలులో కేంద్రం పాత్ర ఏమిటని ప్రశ్నించిన కోర్టు.. కేంద్రం ఆదేశిస్తేనే సెక్షన్‌ 8 అమలు చేయాలని చట్టంలో లేదని తేల్చేసింది. అంతేకాదు.. విభజన చట్టంలో సెక్షన్‌ 5 (ఉమ్మడి రాజధానికి సంబంధించింది) అమలు జరుగుతున్నప్పుడు.. సెక్షన్‌ 8 కూడా అమలులో ఉన్నట్లేనని స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలులో లేదని ఎలా భావిస్తారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. సెక్షన్‌ 8 అమలు విషయంలో గవర్నర్‌దే బాధ్యత అని చెప్పిన హైకోర్టు తాజా వ్యాఖ్యలు చూసినప్పుడు.. సెక్షన్‌ 8 అమలుకు సంబంధించి మార్గదర్శనం చేయాలని గవర్నర్‌ కేంద్రాన్ని కోరటంలో అర్థం లేదన్న విషయం తేలిపోయినట్లేనని చెప్పక తప్పదు.